గ్రామపంచాయతీ కార్మికుల భిక్షాటన పది నెలలుగా విడుదల గాని వేతనాలు
*గ్రామపంచాయతీ కార్మికుల భిక్షాటన*
పది నెలల వేతనాలు విడుదల చేయాలని ఆవేదన
*పెన్ పహాడ్ తెలంగాణ వార్త
గత పది నెలలుగా వేతనాలు అందడం లేదని ఆవేదన చెందుతూ మండల పరిధిలోని లింగాల గ్రామంలో గ్రామపంచాయతీ కార్మికులు శుక్రవారం భిక్షాటన చేపట్టారు ఈ సందర్భంగా మండల గ్రామపంచాయతీ కార్మికుల సంఘం అధ్యక్షులు రణపంగ వెంకటయ్య మాట్లాడుతూ తమతో ప్రభుత్వం వెట్టిచాకిరి చేయించుకుంటుందని వేతనాలు అందించడంలో 10 నెలలు గడుస్తున్నా పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు దీంతో కుటుంబాలు గడవక భిక్షాటన చేపట్టవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికే కుటుంబ పోషణకు పిల్లల చదువులకు నాన్న ఇబ్బందులు పడుతూ అప్పులు చేశామని ఇక మాకు అప్పులు ఇచ్చే వారు కూడా లేకపోవడంతో బిక్షాటన చేయక తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమకు అందించవలసిన వేతనాలను వెంటనే విడుదల చేసి తమ కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది బొల్లం నాగరాజు, మామిడి నారాయణ, రణపంగ శ్రీనివాస్, రణపంగ సైదులు, తదితరులు పాల్గొన్నారు...