శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర ఆలయంలో టెండర్ లో పాల్గొన్న
వివిధ ప్రాంతాలకు చెందిన టెండర్ నిర్వహకులు.
జోగులాంబ గద్వాల 20 జూలై 2024 తెలంగాణవార్త ప్రతినిధి. అలంపూర్:-శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవస్థానము నందు శుక్రవారం నిర్వహించిన వివిధ సీల్డ్ టెండర్ల నందు 1) సప్లయర్స్ సామాగ్రి సరఫరా చేయుటకు వై నరసింహా రెడ్డి వారు, 2) ప్రింటింగ్ కు సంబంధించి శాంతి ఆఫ్ సెట్ ప్రింటర్స్ మహబూబ్ నగర్ వారు, లడ్డు, పులిహోర కవర్లు, క్యారీ బ్యాగ్స్ సరఫరా చేయుటకు ప్రైమ్ ప్లాస్టిక్స్, హైదరాబాద్ వారు, సెక్యూరిటీ, అవుట్ సోర్సింగ్ సిబ్బందిని సరఫరా చేయుటకు వి.యస్.యస్. సెక్యూరిటీ సర్వీసెస్, భూపాల్ పల్లి వారు, తక్కువ కోటేషన్ వేసి ఈ టెండర్లను దక్కించుకున్నారు.
దేవస్థానమునకు అవసరమైన కిరాణా సామాగ్రి సరఫరా చేయుటకు నిర్వహించిన ఈ ప్రోక్యూర్ మెంట్ టెండరు నందు అక్షయ్ అగ్రిటెక్, హైదరాబాద్ వారు తక్కువ కోటేశన్ వేసి ఈ టెండరు దక్కించుకున్నారు. పై తెలిపిన విధంగా టెండరు దక్కించుకున్న వారు ఒక సంవత్సరం పాటు అనగా తేదీ: 01.10.2024 నుండి 30.09.2025 వరకు పై తెలిపిన సామాగ్రిని సరఫరా చేయవలసి యుండును. ఈ టెండరు శ్రీయుత సహాయ కమీషనర్, దేవాదాయ - ధర్మాదాయ శాఖ, మహబూబ్ నగర్ జిల్లా జి. శ్రీనివాస రాజు పర్యవేక్షణలో, కార్యనిర్వహణాధికారి సమక్షంలో నిర్వహించడం జరిగినది....