జూరాల ప్రాజెక్టుకు వరద
జోగులాంబ గద్వాల 20 జూలై 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- రాష్ట్రంలో పలు ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు SRSP ప్రాజెక్టులోకి 21 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతోంది. ప్రస్తుత నీటిమట్టం 1,065 అడుగులుగా ఉంది. జూరాల ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 20వేలు, ఔట్ ఫ్లో 22,877 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుత నీటి నిల్వ 4.951 టీఎంసీలుగా ఉంది. మరోవైపు భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం పెరగడంతో నీటి మట్టం 24 అడుగులకు చేరింది. అని జూరాల ప్రాజెక్ట్ సిబ్బంది వారు ఒక ప్రకటనలో తెలియజేశారు.