ఈ వసతులన్నీ కల్పించండి
జర్నలిస్టు సంఘాల (జేఏసీ)ఐక్య కార్యాచరణ కమిటీ తీర్మానం
హైదరాబాద్ 28 డిసెంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించిన ప్రసార సాధనాలలో పనిచేసే వారందరికీ అక్రెడిటేషన్ కార్డు,తెల్ల రేషన్ కార్డు, ఉచిత విద్య, వైద్యంతో పాటు జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు ఇన్సూరెన్స్,60 ఏళ్ళు పై బడిన వారందరికీ పెన్షన్ పథకం,ఉచిత బస్ ప్రయాణం ఏర్పాటు చేయాలని,సుమారు 40 వేల మంది జర్నలిస్టులతో 'మహా జాతర' నిర్వహించాలని,ఆ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఆహ్వానించి,జర్నలిస్టులు ఇద్దరి వ్యక్తుల చేతుల్లో కీలుబొమ్మలం కాదంటూ.. సభ ఘనంగా నిర్వహిచాలని తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ తీర్మానం చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో శనివారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా 48 సంఘాలు పాల్గొన్నాయి.ఈ సమావేశంలో ప్రారంభోపన్యాసం చేసిన పాశం యాదగిరి మాట్లాడుతూ..సోషల్ మీడియాను బ్యాన్ చేయాలనే అంతర్గత ఉద్దేశంతో ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని, అందులో భాగంగా అక్రెడిటేషన్ నాటకానికి తెర లేపిందని,జివో 252ను వెంటనే తప్పులన్నంటినీ సరి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అధ్యక్షోపన్యాసం చేసిన మామిడి సోమయ్య మాట్లాడుతూ...గత పాతేకేళ్ళ క్రితం ఉన్న సమస్యలే నేటికీ ఉన్నాయని,సాంకేతికంగా అభివృద్ధి చెందిన ఈ కాలంలో అసలు సమస్యలే లేకుండా ప్రభుత్వం ముందుకు వెళ్ళాలని ఆయన కోరారు.ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు కే.కోటేశ్వర్ రావు మాట్లాడుతూ...ఈ ప్రభుత్వ ఏర్పాటులి కేబుల్ టీవీ,సోషల్ మీడియా,డిజిటల్ మీడియా పాత్ర మరువలేనిదని,గతంలో జర్నలిస్టుల వ్యతిరేకంగా ఉన్న అన్ని జీవోలను అంచెలంచెలుగా ఢిల్లీలో ధర్నాలు చేసి వాటిని రద్దు చేయించామని,ఇప్పుడు జరుగుతున్న అక్రెడిటేషన్ రాద్దాంతాలకు వెంటనే ఆపు చేయాలని, సమస్యని సామరస్య పూర్వకంగా పరిష్కారించాలని ఆయన అన్నారు.ముఖ్యఅతిథి ఆనం చిన్ని డీజే ఎఫ్ వర్కింగ్ తెలంగాణ అధ్యక్షుడు కోల శ్రీనివాస్ మాట్లాడుతూ.. జర్నలిస్టులు అందరూ తమ చేతుల్లో ఉన్నారని చెప్పుకొని పదవులు పొందుతున్నారని,వీళ్ళ అవకాశ వాద రాజకీయాల కారణంగా ప్రభుత్వం కళ్ళు కప్పి పబ్బం గడుపుకుంటున్నారని, పాతికేళ్ళుగా ఏం చేయలేక, ఎవరు అధికారంలో ఉంటే వారికి భజన చేస్తూ కాలం వెళ్ళదీస్తున్నారని, జర్నలిస్టుల మహా జాతరతో వాళ్ళ బతుకు బయట పెడతామని చెప్పారు.ఈ కార్యక్రమంలో పులిపలుపుల ఆనందం, కె.కరుణాకర్, వెంకటరత్నం,కన్నూరి రాజు,పడాల వంశీ, ఖమ్మంపాటి సాయి చందర్ గౌడ్,ఆర్. శ్రీనివాస్ గౌడ్,కందుకూరి యాదగిరి,బి.రమేష్ కుమార్,ఎం.శ్రావణ్ కుమార్,బందేల రాజశేఖర్,కొండా శ్రీనివాస్, తన్నీరు శ్రీనివాస్, ఏఐడబ్ల్యూజెఎ ప్రతినిధులు సిహెచ్.వెంకటేశ్వర్లు, పురుషోత్తం,రాజు నరసింహ,డివిఐన్. ప్రసాద్,టిజేఎస్ఎస్ ప్రతినిధులు ప్రధాన కార్యదర్శి గౌటి రామకృష్ణ, సంయుక్త కార్యదర్శి కీర్తి సంతోష్ రాజ్,బాపట్ల కృష్ణమోహన్,మహిళా కోఆర్డినేషన్ మమతారెడ్డి, భాగ్యనగర్ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు సత్యం గౌడ్,శ్రీనివాస్ గౌడ్, రాజనర్సింహ,సి.హెచ్.శ్రీధర్,ఎం.పురుషోత్తం, డా.కే.అంజిరెడ్డి, పి.సుధాకర్ గౌడ్, వి.నరేష్,పి.అశోక్ గౌడ్, నీలం బాలరాజ్, కే.రవీందర్ గౌడ్,సత్యం రాంపల్లి,వెంకట యోగి రఘురాం,మహేష్ కుమార్,సంతోష్ కుమార్, బి.ఎన్.చారి,రాజు, రియాజ్,ఎం.డి.కరీం,సవల్కేర్ శ్రీధర్,మెడిశెట్టి వెంకటేశ్వర్,ఎస్.శ్రీనివాస్ రావు,ప్రమోద్ కుమార్, జె.బాలకృష్ణ,నరేష్ బుచ్చి రెడ్డి,ఎస్.శివప్రసాద్ గౌడ్,లక్వుద్దీన్,శోభన్ బాబు,వేణుగోపాల్ , ఆర్.వి.ఎల్.ఎన్.ప్రసాద్, దారం జగన్నాథం రెడ్డి, నంబి పర్వతాలు, సి.హెచ్.శ్రీనివాస్, రవికాంతి శ్రీనివాస్, కె.బాబురావు,వివిధ జిల్లాల ప్రతినిధులు, తదితర పాత్రికేయులు పాల్గొన్నారు.