గురుకుల విద్యార్థులు ప్రపంచ స్థాయి క్రీడాకారులుగా ఎదగాలి""2024 ఒలంపిక్స్ సభల్లో మంత్రి" తుమ్మల

తెలంగాణ వార్త ప్రతినిధి: గురుకుల విద్యార్థులు ప్రపంచ స్థాయి క్రీడాకారులు ఎదగాలి
•"స్వామి"నారాయణ గురుకుల్ లో విలువలతో కూడిన విద్య
•సంస్కృతి సాంప్రదాయం విలువలకు పెద్దపీట
•ఖమ్మంలో స్వామినారాయణ్ గురుకులం ఏర్పాటు
•క్రీడలతో మానసిక ఉల్లాసం ,ఆరోగ్యం
•ఆటలు శారీరక దారుఢ్యాన్ని పెంపొందిస్తాయి
•గురుకుల ద్వారా సమగ్ర విద్య
•ఇంటిగ్రేటెడ్ గురుకులాలతో ప్రపంచ స్థాయి విద్య
•2024 ఒలింపిక్స్ సభలో మంత్రి "తుమ్మల"
గురుకులాల విద్యార్థులు క్రీడల్లో నైపుణ్యాన్ని పెంపొందించుకొని ప్రపంచస్థాయి క్రీడాకారులుగా ఎదగాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. బుధవారం మోనాబాద్, చేవెళ్ల రోడ్డులోని శ్రీ స్వామి నారాయణ గురుకులలో నిర్వహించిన “గురుకుల ఒలింపిక్స్ - 2024” క్రీడా వేడుకలను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. తొలుత క్రీడాకారులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ స్వామి నారాయణ ట్రస్టు ప్రపంచవ్యాప్తంగా 60కి పైగా గురుకులాలు నిర్వహిస్తుందన్నారు. శ్రీ స్వామి నారాయణ ట్రస్ట్ దేశానికి ప్రపంచానికి విలువలు సంస్కృతి సాంప్రదాయాలతో కూడిన విద్యనుందిస్తున్నారని తెలిపారు. మానవాళికి దేశానికి తగినంత సేవ చేసే అవకాశం ఈ విద్యాలయం ద్వారా లభిస్తుందన్నారు. దేశ సౌభాగ్యం, భారతదేశం సాంప్రదాయాన్ని విలువలను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పే అవకాశం ఈ విద్యాలయం ద్వారా లభిస్తుందన్నారు. ఖమ్మంలో ఇలాంటి విద్యాలయం ఉండాలని స్వామీజీని ఏర్పాటు చేయమని ప్రార్థించామని ఖమ్మంలో కూడా ఈ విద్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఖమ్మం విద్యార్థులు చాలా మంది ఇక్కడ చదువుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ విద్యాలయం నుంచి వెళ్లే ప్రతి పౌరుడు తలెత్తుకొని భారతావని యొక్క సంస్కృతి సాంప్రదాయాలను చాటాలన్నారు. తెలంగాణ విద్యార్థులు చదువులతోపాటు క్రీడలలో సత్తా చాటాలన్నారు. క్రీడాకారులు తమ ప్రతిభ పాటవాలను చాటి తెలంగాణ ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేయాలన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. చదువులతోపాటు క్రీడలలో రాణించిన వారికి ఉద్యోగ భద్రత కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. భవిష్యత్తులో ఒలంపిక్స్ కు ఆతిథ్యమిచ్చేలా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తామన్నారు. క్రీడలు విద్యార్థుల్లో శారీరక,మానసిక అభివృద్ధికి దోహద పడతాయన్నారు. శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుందని, మానసిక ఒత్తిడి తగ్గుతుందని,సామాజిక సంబంధాలు బలపడతాయని పేర్కొన్నారు. వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించడానికి క్రీడలు ఎంతో దోహదం చేస్తాయన్నారు. ఆటలతో మనసుకు ఆనందాన్ని ఇస్తాయని, శరీరాన్ని బలంగా ఆరోగ్యంగా ఉంచుతాయన్నారు. క్రీడలు ధైర్యాన్ని మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని వివరించారు.
సామరస్యం, సహకారం, స్నేహం వంటి విలువలను పెంపొందిస్తాయని వీటికి తోడు నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవచ్చున్నారు. తెలంగాణ ప్రభుత్వం గురుకులాల ద్వారా సమగ్ర విద్యా విధానాన్ని అమలు చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. అన్ని వర్గాల విద్యార్థులకు కార్పోరేట్ విద్యకుద్దీటుగా నూతన ఆధునిక సాంకేతిక పద్ధతులలో విద్యను అందిస్తున్నట్లు మంత్రి తుమ్మల వివరించారు. నూతనంగా ఇంటిగ్రేటెడ్ గురుకులాల ఏర్పాటుతో ప్రపంచస్థాయి విద్యా విధానాన్ని అమలకు పూనుకున్నట్లు పేర్కొన్నారు.