గచ్చిబౌలి స్టేడియంలో వికలాంగుల క్రీడోత్సావాలను ప్రారంభించిన మంత్రి సీతక్క 

Nov 27, 2024 - 19:31
 0  6
గచ్చిబౌలి స్టేడియంలో వికలాంగుల క్రీడోత్సావాలను ప్రారంభించిన మంత్రి సీతక్క 
గచ్చిబౌలి స్టేడియంలో వికలాంగుల క్రీడోత్సావాలను ప్రారంభించిన మంత్రి సీతక్క 
గచ్చిబౌలి స్టేడియంలో వికలాంగుల క్రీడోత్సావాలను ప్రారంభించిన మంత్రి సీతక్క 

హైదరాబాద్ 27 నవంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- హైదరాబాద్ మహానగరంలో గచ్చిబౌలి స్టేడియంలో వికలాంగుల క్రీడల మహోత్సవంను మంత్రి సీతక్క ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిదులుగా ఎంఎల్సి పట్నం మహేందర్ రెడ్డి, సాట్స్ చైర్మన్ శివసేనా రెడ్డీ ,వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వీరయ్య ముత్తినేని,ఉమెన్ కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి , సెక్రటరి అనితా రామచంద్రన్ , డైరెక్టర్ శైలజ పాల్గొన్నారు.


మంత్రి వర్యులు సీతక్క మాట్లాడుతూ..
ప్రపంచ వికలాంగుల దినోత్సవము ను వికలాంగులకు పండుగ రోజులా ఘనంగా జరుపుకుందాం అన్నారు.ఏదో ఒక రకమైన వైకల్యం ఉన్నప్పటికీ  ఆత్మ స్థైర్యంతో, బలమైన సంకల్పంతో వికలాంగులు క్రీడల్లో ప్రపంచ స్థాయిలో పథకాలు సాధించడం నిజంగా చారిత్రిక అంశం అన్నారు.వరంగల్ బిడ్డ జీవన్ జీ దీప్తి పారా ఒలింపిక్ క్రీడలలో బ్రాంజ్ మెడల్ సాధించి దేశం గర్వించేలా చెసింది అన్నారు.ఆమెకి ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఆద్వర్యంలో మాట్లాడి కోటి రూపాయలు నగదు,500ల గజాల స్థలం ఇచ్చామని గ్రూపు 2 ఉద్యోగం కూడా త్వరలోనే ఇస్తామని చెప్పారు.వికలాంగులకు ప్రకటించిన 6వేల పెన్షన్ కూడా వీలైనంత త్వరగా అందిస్తామని,వికలాంగుల సమస్యలు పరిష్కరించాడినికి ముఖ్య మంత్రి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.త్వరలోనే బ్యాక్ లాగ్ ఉద్యోగాలను కూడా నింపుతామని తెలియ జేశారు. పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ..ప్రభుత్వం పరంగా వికలాంగులు సమస్యలను పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియ జేశారు. శాట్స్ చైర్మన్ శివసేన రెడ్డీ మాట్లాడుతూ..రాబోయే స్పోర్ట్స్ పాలసీలో వికలాంగులకు పెద్ద ఎత్తున ప్రాధాన్యం ఇస్తామని , శాట్స్ ఎల్లప్పుడూ వికలాంగ క్రీడాకారులను ప్రో త్సాహించడానికి సిద్ధంగా ఉంది అని తెలియజేశారు. ముత్తినేని వీరయ్య  వికలాంగుల కో-ఆపరెటివ్ కార్పొరేషన్ చైర్మన్  మాట్లాడుతూ..


వికలాంగులను క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా అధునాతనమైన పరికరాల కోసం 3లక్షలు రూపాయలు కేటాయించేలా & అన్ని రకాల సహాయ ఉపకరణాలులో 5 % రిజర్వేషన్ నీ కల్పించడానికి  మేనేజ్ మెంట్ కమిటీలో తీర్మానం చేశామని అన్నారు.జీవన్ జీ దీప్తికీ కోటి రూపాయలు నగదుతో పాటు 500ల గజాల ఇంటి స్థలం, గ్రూప్ 2 ఉద్యోగం కేటాయించి నందుకు పారా స్పోర్ట్స్ గౌరవాధ్యక్షుడు గా,కార్పొరేషన్ చైర్మన్ గా సమస్త వికలాంగుల తరుపున ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రి సీతక్కకి, శాట్స్ చైర్మన్ శివ సేనా రెడ్డీకి ధన్యవాదాలు తెలిపారు.ఉమెన్ కార్పొరేషన్ చైర్మన్ శోభారాణి గారు మాట్లాడుతూ వికలాంగులు కి ప్రభుత్వం ఎల్లపుడూ అండగా ఉంటుందని అన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333