క్యాలెండర్ ను ఆవిష్కరించిన తహసిల్దార్ శేషగిరిరావు
అడ్డగూడూరు 26 జనవరి 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలో తాసిల్దార్ కార్యాలయంలో ప్రజా జ్యోతి నూతన సంవత్సర క్యాలెండర్ ను సోమవారం అడ్డగూడూరు తహసిల్దార్ శేషగిరిరావు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా తహసిల్దార్ శేషగిరిరావు మాట్లాడుతూ..పత్రికలు అనేవి ప్రజా సమస్యలను వెలికి తీసి నిస్వార్థంతో, నిబద్దతతో వార్తలు రాసి ప్రజల మన్నలను పొందాలన్నారు.ప్రజా జ్యోతి పత్రికకు శుభాకాంక్షలు తెలుపుతూ,ప్రజా సమస్యలు అధికారులకు చేరవేయడంలో ముందుండాలన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజా జ్యోతి విలేఖరి చిత్తలూరి సుధాకర్,డిప్యూటీ తహసిల్దార్ నరసింహారావు,ఆర్ఐ ఉపేందర్,సీనియర్ అసిస్టెంట్ నగేష్,రెవిన్యూ సిబ్బంది నాగరాజు,విలేకరులు కడెం రవివర్మ,మంటిపల్లి సతీష్,నోముల ఉపేందర్, ప్రజా ప్రతినిధులు,పలు పార్టీల నాయకులు గూడపు నాగరాజు ములుగురి శివ,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.