70 ఏళ్ల వయసులో నిర్వాసితుల కోసం కాలినడకన తిరుపతికి చేరుకున్న పెబ్బేటి నారాయణరెడ్డి
14-03-2026 తెలంగాణ వార్త రిపోర్టర్ చిన్నంబావి మండలం: చిన్నంబావి మండలం నుండి వృద్ధ యువకుడు శ్రీశైలం నిర్వాసితుల ఉద్యోగాల కోసం 70 ఏళ్ల వయసులో కాలినడక యాత్ర. శ్రీశైల నిర్వాసితుల సమస్యల కోసం ప్రాణాన్ని, వయసును లెక్కచేయకుండా తిరుపతికి చేరుకున్న పెబ్బేటి నారాయణరెడ్డి.
శ్రీశైలం ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు పెబ్బేటి నారాయణరెడ్డి శ్రీశైలం నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం, వారి గోసను చూడలేక నడుచుకుంటూ వెళ్లి ఏడుకొండల వెంకన్న స్వామి చెవిలో చెబితే ఏడుకొండల వెంకన్న దీవెనలతో నైనా మంత్రుల ఆలోచనలు మారి శ్రీశైలం నిర్వాసితులకు ఉద్యోగాలు కల్పిస్తారని ప్రత్యేకంగా మొక్కు పెట్టుకుని ఇటీవల తిరుపతి పుణ్యక్షేత్రానికి కాలినడక యాత్ర చేపట్టారు. గత పది రోజుల కిందట ప్రారంభమైన ఈ యాత్ర నిర్వాసితుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.శ్రీశైలం ప్రాజెక్ట్ కారణంగా నిర్వాసితులైన కుటుంబాలకు ఉద్యోగాలు కల్పించాలని, దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కారమవాలని కోరుతూ నారాయణరెడ్డి ఈ మొక్కు పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తిరుపతి మెట్లపై మోకాలపై నడుస్తూ మొక్కులు చెల్లించుకున్నారు.దాదాపు 40 సంవత్సరాలుగా నిర్వాసితులు ఎదురుచూస్తున్న ఉద్యోగాల కల నెరవేరాలని, తిరుపతి పుణ్యక్షేత్రాన్ని దర్శించు కుంటున్నానని చెప్పారు. నిర్వాసితుల బాధలను దేవుడి దృష్టికి తీసుకెళ్లాలని ఈ యాత్రను చేపట్టినట్లు తెలిపారు.ఇప్పటికే 70 సంవత్సరాల వయస్సులో కూడా నారాయణరెడ్డి కాలినడకన తిరుపతికి బయలుదేరడం నిర్వాసితుల్లో విశేష ఉత్సాహాన్ని కలిగించింది. ఆయన ధైర్యం మరియు సంకల్పం చూసి పలువురు అభినందనలు తెలిపారు.మొక్కు చెల్లించుకుని తిరుగు ప్రయాణంలో కూడా దేవుడి కృపతో సురక్షితంగా ఇంటికి చేరాలని నిర్వాసితులు అందరూ కొనియాడారు.