శ్రీ లింగమంతుల స్వామి ఉత్సవాలు ప్రారంభం

May 25, 2024 - 20:02
 0  2
శ్రీ లింగమంతుల స్వామి ఉత్సవాలు ప్రారంభం

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్   నేటి నుండి గట్టికల్లు శ్రీ లింగమంతుల స్వామి జాతర ఉత్సవాలు ప్రారంభం* ఆత్మకూర్ ఎస్... ఆత్మకూరు మండల పరిధిలోని గట్టిగల్లు గ్రామంలో శ్రీ లింగవంతల స్వామి జాతర ఉత్సవాలు ఆదివారం నుండి ప్రారంభం కానున్నాయి. సుమారు 100 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన పురాతన లింగవంతల స్వామి ఆలయంలో ఈ ఉత్సవాలను నిర్వహించనున్నారు. యాదవుల ఆరాధ్య దైవమైన లింగమంతుల స్వామి సవనమ్మ, గంగా మాత,పోతరాజు కు జాతర ఉత్సవాలలో ప్రత్యేక పూజలు జరుపుతారు. సూర్యాపేట తో పాటు ఖమ్మం, మహబూబాద్, వరంగల్, యాదాద్రి జిల్లాల నుండి మొక్కుబడులు ఉన్న యాదవ భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొని మొక్కుబడులు చెల్లించుకుంటారు. ఆదివారం నుండి బుధవారం వరకు జరిగే ఈ ఉత్సవాల్లో భారీగా భక్తులు పాల్గొంటారు . చుట్టుపక్కల గ్రామాల నుండి మొక్కుబడులు ఉన్న భక్తులు రాగా గ్రామంలో అన్ని కుటుంబాల వారు నాలుగు రోజులు అత్యంత వైభవంగా జాతర ఉత్సవాలు నిర్వహిస్తారు. గ్రామ సమీపంలో దేవుని బండపై ఉన్న శ్రీ లింగమంతుల స్వామి ఆలయం వద్ద జాతర ఉత్సవాలు నిర్వహించనున్నారు. రెండేళ్లకోసారి జరిగే ఉత్సవాలు ఆదివారం బోనాల తో భక్తులు ఆలయం కు చేరుకుంటారు.సోమవారం తెల్లవారుజామున బోనాలు ప్రదక్షిణ బలిపూజ ఉంటుంది.ఆకుమంచమ్మ బోనం, మంగళ వారం,మాణిక్యమ్మ, వేషధారణ పొదుపు గొర్రె, జాగిలాలు, పలహారపు బండ్ల ప్రదర్శన, బుధవారం ముగింపు ఉంటుంది. వీటి తో పాటు ప్రతిరోజు రాత్రి దేవుని బండపై బైకానీ పూజారుల చే స్వామివారి పురాణ చరిత్ర ఒగ్గు కథ ఉంటాయి..