చిన్నంబావి మండల పరిసర ప్రాంతమైన గూడెం గ్రామపంచాయతీ ఆఫీస్ దగ్గర, అంగన్వాడి కేంద్రం దగ్గర

Jan 26, 2026 - 19:51
 0  1
 చిన్నంబావి మండల పరిసర ప్రాంతమైన గూడెం గ్రామపంచాయతీ ఆఫీస్ దగ్గర, అంగన్వాడి కేంద్రం దగ్గర

26-01-2026 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం : ప్రాథమిక పాఠశాల దగ్గర 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు, మరియు,ప్రాథమిక పాఠశాల గూడెం. గూడెం  గ్రామంలోని గ్రామపంచాయతీ దగ్గర, అంగన్వాడి కేంద్రం దగ్గర, ప్రాథమిక పాఠశాలలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేకువ జామున ప్రభాత భేరితో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9.00 గంటలకు గ్రామ ప్రజలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు అందరూ కలిసి గ్రామపంచాయతీ ఆఫీస్ దగ్గర  150వ వందేమాతరం వసంతం సందర్భంగా వందేమాతరం గానాన్ని సమూహికంగా ఆలపించారు.
అనంతరం గ్రామ సర్పంచ్ కొత్త వెంకటరెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఆ తర్వాత అంగన్వాడి కేంద్రం దగ్గర టీచర్ పార్వతమ్మ జాతీయ పతాకాన్ని ఎగరవేశారు, ఆ తర్వాత  ప్రాథమిక పాఠశాల దగ్గర ప్రధానోపాధ్యాయులు నరేందర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. 
ఈ సందర్భంగా చిన్నారి విద్యార్థులచే నృత్య ప్రదర్శనలు, ఉపన్యాసాలు,  నిర్వహించారు.
తదుపరి నిర్వహించిన ఆటల పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేసి, చివరగా మిఠాయిల పంపిణీ చేశారు.
 విద్యార్థులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న గుడెం గ్రామ మాజీ సర్పంచ్ మామిళ్ళపల్లి చక్రవర్తి చిన్నారులకు శాశ్వత పరిష్కారంగా 20వేల  రూపాయలతో అక్యు గ్రౌండ్ మినరల్ వాటర్ ప్లాంట్ ను పాఠశాలకు బహుమానంగా గ్రామస్తులతో అందించారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొత్త వెంకటరెడ్డి, ఉప సర్పంచ్ సింగోటం శోభ, వార్డు నెంబర్లు మూసి మోని శివ, కురువ వెంకట స్వామి, గొందిపర్ల బాలకృష్ణ,బత్తుల మోహన్, ఈశ్వరమ్మ, మామిళ్ళపల్లి శ్రీరాములు, క్యాతూర్ మహేష్ వీరితోపాటు గ్రామ పెద్దలు తోట బాలకృష్ణ, సుధాకర్, మక్బూల్ పాషా, రాఘవేంద్ర శెట్టి, సింగోటం బాలస్వామి, గుంటి నారాయణ, యువకులు, పాఠశాల ఉపాధ్యాయులు నరేందర్,   మధు గారు, అంగన్వాడీ టీచర్ పార్వతమ్మ, ఆశా వర్కర్లు,  కార్యకర్తలు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
 ఆ తర్వాత సర్పంచ్ కొత్త వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ సభను ఏర్పాటు చేశారు.
 ఆ యొక్క గ్రామ సభకు పంచాయతీ సెక్రెటరీ విక్రమ్ యాదవ్, ఉప సర్పంచ్, వార్డ్ నెంబర్లు గ్రామ సభకు హాజరై గ్రామంలో ఉండే సమస్యలపై పరిష్కారం చేసి సర్పంచ్ నుండి సలహాలు సూచనలు తీసుకున్నారు. ఈ యొక్క గ్రామ సభకు గ్రామస్తులు అధికంగా పాల్గొని వారి యొక్క సమస్యలను సభలో విన్నవించారు, కొన్ని సమస్యలకు అక్కడనే పరిష్కారం చేసి గ్రామ సభను విజయవంతం చేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333