డీకే మ్యూజిక్ అకాడమీ ఆధ్వర్యంలో వేసవి సంగీత తరగతులు..

తెలంగాణ వార్త 16 ఏప్రిల్ నిజామాబాద్ జిల్లా ప్రతినిధి:- డీకే మ్యూజిక్ అకాడమీ ఆధ్వర్యంలో వేసవికాలం సంగీత తరగతులు ఏప్రిల్ 22 నుంచి ప్రారంభం కానున్నదని, మే 31 వరకు సంగీతం తక్కువ ఫీజితో నేర్పించబడునని సంగీతం మాస్టారు:దినేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.ఏప్రిల్ 22 నుంచి ఉదయం 9 నుంచి 10 గంటల వరకు,సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు అన్ని వయసుల వారికి గంగస్థాన్ ఫెస్-2 లో రోడ్ నెంబర్-5 లో సుదర్శన్ రావు అపార్ట్మెంట్ లో తరగతులు చెప్పబడునని తెలిపారు. కర్ణాటక సంగీతంతో పాటు కీబోర్డ్,గిటార్ కాంగో,ప్యాడ్స్, డ్రమ్స్ నేర్పించబడునని ఇతర వివరాలకు 84640 32683, 94400 23331 లలో సంప్రదించాలని కోరారు.