క్యాన్సర్ ను ముందస్తుగా గుర్తించడం అంటే లక్షణాల ఆధారంగా కొన్ని పరీక్షలను చే యించుకోవడమే.
యూకే, అమెరికాతో సహా భారత్ కూడా పరీక్షల్లో వెనుకబడి ఉండడం విచారకరం.
దాని వల్ల క్యాన్సర్ మరింత భయంకరమైన వ్యాధిగా పరిణమించిoది
---వడ్డేపల్లి మల్లేశం
ప్రారంభ దశలో క్యాన్సర్ ను గుర్తిస్తే కోలుకునే అవకాశాలు ఎక్కువ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. క్యాన్సర్ అనే పదం విoటేనే ఒక రకమైన ఆందోళన మనలో కలుగుతుంది. ఇది ప్రాణాలు తీసే అత్యంత ప్రమాదకరమైన వ్యాధి అని చాలామంది భావిస్తుంటారు కానీ వైద్య చికిత్సతో పాటు అవగాహన పెరిన కారణంగా 1970 నుండి ఈ వ్యాధి బారిన పడిన వారు కోలు కుంటున్న రేటు మూడింతలు పెరగడం ఆశాజనకమంటే ప్రారంభంలోనే ఈ వ్యాధిని గుర్తించడమే కదా! అనేక రకాల క్యాన్సర్లు తో బాధపడుతున్న వారు ముందుగా గుర్తించడం వలన చికిత్సలు చేసుకోవడంతో రోగులు ప్రాణాలతో బయటపడుతు తమత జీవిత కాలాన్ని కూడా పెంచుకుంటున్నారు. ఆశ్చర్యకరమైన విషయం బ్రిటన్ లోని క్యాన్సర్ రీసెర్చ్ యూకే అనే సంస్థ అధ్యయనంలో సగం కంటే ఎక్కువ మంది క్యాన్సర్ ఉనికిని తెలిపే ఏదో రకమైన లక్షణంతో బాధపడుతున్నారని కానీ కేవలం 2 శాతం మాత్రమే తమకు వ్యాధి ఉన్నట్లు అనుకుంటున్నారు మిగతా 3వంతుల మందికి పైగా ప్రజలు ఈ ప్రమాద సంకేతాలను పట్టించుకోవడంలేదని చేసిన హెచ్చరిక ఆందోళన కలిగించే విషయం. అంటే అక్కడి ప్రజలు క్యాన్సర్ లక్షణాలను పట్టించుకోకుండా వదిలేయడం ప్రణాంతకంగా పరిణమిస్తున్న వేళ అమెరికన్ క్యాన్సర్ సొసైటీ వాళ్లు అన్ని రకాల క్యాన్సర్లకు సంబంధించి 10 రకాల లక్షణాలను తెలియజేస్తున్నందున ఆ లక్షణాలు కనిపించినప్పుడు అనుమానంతో సంబంధిత పరీక్షలు చేయించుకోవడం ద్వారా ముందస్తుగా జాగ్రత్త పడే అవకాశం ఉన్నది .
ప్రాణాంతకమైన క్యాన్సర్కు పది లక్షణాలు:-
అతిగా బరువు తగ్గడం లేదా పెరగడం
జ్వరం
క్యాన్సర్ ఉన్న వ్యక్తి ఏదో ఒక సందర్భంలో జ్వరం బారిన పడుతూ ఉంటారని దానికి ఇచ్చే చికిత్స కారణంగా రోగ నిరోధక వ్యవస్థ పై ప్రభావం చూపడం వల్ల రోగులు జ్వరం బారిన పడే అవకాశం ఉంటుందని వైద్యనిపుణులు తెలియజేస్తున్నారు.
అలసట
క్యాన్సర్ క్రమంగా పెరుగుతున్నది అనేదానికి ఇది ప్రధాన సంకేతంగా ఉంటుందని చెబుతున్నారు ముఖ్యంగా లుకే మియాలాంటి కొన్ని క్యాన్సర్లలో అలసటనే తొలి లక్షణంగా భావిస్తారు. పెద్ద పేగు కడుపు క్యాన్సర్లలో ఈ లక్షణం స్పష్టంగా కనబడుతుంది.
శరీరంలో భారీ మార్పులు
శరీరము నల్లగా, ఎర్రగా మారడం, దురద రావడం, కళ్ళు పసుపచ్చగా మారడం వంటి కొన్ని లక్షణాలు.
--- ప్రేగు, మూత్రశయం లో మార్పులు
మల బద్ధకము, డయేరియా, ఎక్కువ కాలం మలములో మార్పులు పెద్ద పేగు క్యాన్సర్ కు సంకేతాలు కావచ్చునని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మూత్రంలో మంట నొప్పి మూత్రాషయంలో మార్పులు ప్రొస్టేట్ క్యాన్సర్ కు కారణం కావచ్చు
గాయాలు మానకపోవడం, lపుట్టుమచ్చలు పెరిగి రక్తం కారడం, చిన్న గాయాలైన ఎక్కువకాలం మానకపోవడం, నోట్లో పుండు త్వరగా మారకపోవడం, జననేంద్రియాలపై పుండ్లు.
. రక్తస్రావం
రక్తస్రావం వలన క్యాన్సర్ లేదా మల క్యాన్సర్ లేదా గర్భాశయ క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉన్నది కిడ్నీ క్యాన్సర్ కు కూడా ఇదే లక్షణం.
చను మొనలనుంచి రక్తం కారడం రొమ్ము క్యాన్సర్ లక్షణాలలో ఒకటి.
శరీరంలో ఏదైనా భాగం గట్టిగా మారిపోవడంతో వచ్చే క్యాన్సర్లు ముఖ్యంగా రొమ్ములో, వృషణాలలో, గ్రంధులలో, కణజాలాల్లో ఏర్పడవచ్చు. ఏదైనా శరీర భాగం గట్టిగా మారిపోవడం క్యాన్సర్ కు ప్రారంభ దశ కావచ్చు లేదా చివరి దశ కూడా కావచ్చు.
ఆహారాన్ని నీటిని మింగడం లో ఇబ్బందులు ఎదుర్కొంటే అది అన్నవాహిక, కడుపు క్యాన్సర్, లేదా గొంతు క్యాన్సర్ గా భావించాల్సి ఉంటుంది.
విపరీతమైన దగ్గు లేదా గొంతు బొంగురు పోవడం
విపరీతంగా దగ్గు రావడం ఊపిరితిత్తుల క్యాన్సర్ కు సంకేతం అయితే. మూడు వారాలకు మించి ఇబ్బంది పడుతుంటే డాక్టర్ను సంప్రదించడం శ్రేయస్కరమని గొంతు బొంగురు పోవడం అంటే స్వర పేటి కలేదా థైరాయిడ్ గ్రంథి కి సూచన కావచ్చు.
పైన తెలిపిన పది లక్షణాలు మాత్రమే క్యాన్సర్ కు సంబంధించినవి కాకపోయినా ఈ లక్షణాలు కనపడినప్పుడు క్యాన్సర్ నిర్ధారిత పరీక్ష చేసుకోవడం వల్ల ప్రమాదకరమైన ముప్పు నుండి తప్పించుకునే అవకాశం ఉన్నది అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గర్భాశయ క్యాన్సర్ నిర్ధారిత పరీక్షలు ప్రపంచవ్యాప్తంగా తీరుతన్నులు
ఇండియాలోని మహిళల్లో ఎక్కువగా కనబడుతున్న క్యాన్సర్లలో గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ రెండవ స్థానంలో ఉన్నది. భారతదేశంలో ప్రతి ఏటా లక్షకు పైగా కొత్త కేసులు వెలుగు చూస్తున్న నేపథ్యంలో ప్రాణాంతకమైన ఈ క్యాన్సర్ బారినపడి 2020 సంవత్సరంలో దేశవ్యాప్తంగా 77 వేల మంది మహిళలు మరణించినట్లుగా గణాంకాలు తెలియజేస్తుంటే ఈ రకమైన క్యాన్సర్ కు సంబంధించినటువంటి పరీక్షలు భారతదేశంలో రెండు 2 లోపే ఉండడం ఆందోళన కలిగించే విషయం. అంతెందుకు అమెరికా బ్రిటన్ వంటి అభివృద్ధి చెందిన దేశాల లోపల కూడా నిర్ధారిత పరీక్షలు నామాత్రంగా ఉండగా ఐరోపాలోని ఈ క్రింది కొన్ని దేశాలలో 2022 నాటికి మూడేళ్లలో 20 నుండి 69 ఏళ్ల వయస్సు గల స్త్రీలలో గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ పరీక్షలు చేయించుకున్న వారి శాతాన్ని గమనిస్తే అక్కడి మహిళల చైతన్యంతో మనం ఎంతో గుణపాఠం తెచ్చుకోవాల్సిన అవసరాన్ని తెలియజేస్తుంది.
స్వీడన్ 78.8%
ఐర్లాండ్ 73.1%
ఫిన్లాండ్ 71.5%
బెల్జియం 54.8%
నెదర్లాండ్స్ 45.7%
ఇటలీ 40.2%
జర్మనీ 37%
తుర్కియే 31.2%
పోలాండ్ 10.9 శాతం
ఇండియా 2% మాత్రమే
అత్యంత దయనీయస్థితి ప్రపంచంలో పర్యావరణ కాలుష్యం, ప్లాస్టిక్ వినియోగం, భూమి నీటి ఆహార కాలుష్యం వల్ల మనిషి ఉనికి పెను ప్రమాదకరంగా మారిన సందర్భంలో క్యాన్సర్ నిర్ధారిత పరీక్షలను ముందస్తుగా చేయించుకోవడం ప్రాథమిక కర్తవ్యం గా అవసరంగా భావించినప్పుడే భారతదేశంలో దీనికి అడ్డుకట్ట వేయగలం.. లక్షల మరణాలను ఆపగలం.
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )