నేటి మాటతో ప్రారంభించిన నా వ్యాస పరంపరకు నేటితో ఐదు సంవత్సరాలు పూర్తి.

Apr 1, 2025 - 20:51
Apr 1, 2025 - 20:53
 0  4

ప్రాథమిక పాఠశాల విద్యార్థుల నుండి విశ్వవిద్యాలయ ఆచార్యుల వరకు ఐఏఎస్, ఐపీఎస్, న్యాయమూర్తులు, విద్యా వైద్య నిపుణులు, మేధావులు, బుద్ధి జీవులు, నా వ్యాసాల పాటక మహనీయులకు అభివందనములు.

31 మార్చి 2020 రోజున ప్రారంభించిన నా వ్యాస పరంపర నేటి మాటతో ప్రారంభమై నేటికీ ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మీరందించిన సహకారం, విమర్శ, సద్విమర్శ, ప్రోత్సాహం, చర్చ, అన్నీ నా వ్యాసాలను మరింత ఉత్తేజ కరంగా రాయడానికి తోడ్పడినాయని మిమ్ములను నేను మనసారా అభినందిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

సామాజిక రాజకీయ ఆర్థిక చారిత్రక అంశాలతో పాటు ముఖ్యంగా కుటుంబ బంధాలకు సంబంధించి, ఆరోగ్యము, పర్యావరణ పరిరక్షణ, ప్రాపంచిక దృక్పథం, రాజకీయ పెట్టుబడిదారీ వ్యవస్థ, అసమానతలు అంతరాలు, కనీస జీవన ప్రమాణాలు, మానవాభివృద్ధి, మెరుగైన జీవన ప్రమాణాలు, సమసమాజ స్థాపన, రాజ్యాంగం అందించిన ఫలాలు, సామ్యవాద స్థాపన, కవులు కళాకారులు మేధావుల బాధ్యతలు, పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలు, పెట్టుబడి దారి వర్గానికి వంత పాడుతున్న ప్రభుత్వాల సరళి, యుద్ధ వీరులుగా తమ యుద్ధాన్ని కవులు కళాకారులు సామాజిక రుగ్మతల పైన ఎక్కువ పెట్టవలసిన ధోరణితోపాటు ప్రాపంచిక సమస్యల పైన నా శక్తి మేరకు గత ఐదేళ్లుగా ప్రతిరోజు ఒక వ్యాసాన్ని మీకు అందిస్తూ మీ ఆదరాభిమానాలను చూర గొన్నందుకు నేను ధన్యుణ్ణి. అదే కోవలో నాకు మీ సహకారాన్ని అందించి ప్రోత్సహించి నిస్సందేహంగా నిరంతరము రాయాలని మనసు విప్పి మీ మనసులో నాకు స్థానం ఇచ్చినందుకు నేను సర్వదా కృతజ్ఞుడను. అనేక రకాల రంగాలకు చెందిన నిపుణులు ఇవ్వాలా నాకు పరిచయం కావడం వాట్స్అప్ ఫేస్బుక్ రోజు రాస్తున్న వ్యాసాల ప్రచురణ సంపాదకులు జర్నలిస్టులు తమ తమ రంగాల్లో తోడ్పాటు అందించి నా ఎదుగుదలకు సహకరించిన మీ అందరికీ సామాజిక ఉద్యమ అభివందనాలు. మీ తోడ్పాటు ప్రోత్సాహం కొనసాగినంత కాలం నా ఈ రచన వ్యాసంగాన్ని రోజుకొక వ్యాసాన్ని నిరంతరం కొనసాగిస్తానని మరొకమారు మీకు మాట ఇస్తూ ఈ వ్యాసాలను పుస్తక రూపంలో తీసుకురావాలని అనేకమంది మేధావులు బుద్ధి జీవులు గౌరవ పెద్దలు చేస్తున్న సూచనను పాటించడానికి సిద్ధంగా ఉన్నానని మరొక్క మారు మీరు తెలియజేస్తూ సర్వదా మీ ఆదరాభిమానాలు, అభిప్రాయాలను కోరుతున్నాను.

వడ్డేపల్లి మల్లేశం

ధ్వి సహస్రాధిక వ్యాసకర్త 

హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ 9014206412

  నిరంతరం నా వ్యాసాలను అధ్యయనం చేసి మీ అభిప్రాయాలను నిర్మోహమాటంగా తెలియజేస్తారని విశాలమైన పరిధిలో వీలున్న మేరకు మీ మిత్రులకు అందిస్తారని మనసారా కోరుకుంటున్నాను.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333