సంతు శ్రీ శ్రీ శ్రీ సేవాలాల్ మహారాజ్ గారి 286వ జయంతిని విజయవంతం చేయాలి
ఫిబ్రవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- బంజారాల జీవన విధానానికి, ఆస్తిత్వానికి, సంస్కృతి మరియు సాంప్రదాయాలకు ఆటంకాలు కల్పించిన ఆంగ్లేయుల పాలనపై వ్యతిరేకంగా పోరాటం చేసిన మహనీయుడు, భారతదేశ హిందూ ధర్మాన్ని పాశ్చాతా సంస్కృతి నుండి కాపాడడానికి పోరాటం చేసిన ధన్యజీవి సంతు శ్రీ సేవాలాల్ మహారాజ్ గారు. బంజారాల జాతి మొత్తాన్ని సన్మార్గంలో నడిపించుటకు తాను చేసిన కృషి జాతి పట్ల ఆయనకు ఉన్న ప్రేమ అమోఘమైనది. దేవుళ్ళు మరెక్కడో ఉండరు మనుషుల మనసులలో ఉంటారని ప్రతి బంజారా బిడ్డలు సృష్టిలోని ప్రాణం ఉన్న ప్రతి జీవి పై ప్రేమ, జాలి చూపించి మెసులుకోవాలని బంజారా జాతి మొత్తాన్ని ఒక తాటిపై తీసుకొచ్చి నడిపించిన వ్యక్తి,బంజారా తెగ సంక్షేమానికై తన జీవితాన్నే త్యాగం చేసినా మహామనిషి కావున ఈ జాతి బిడ్డలు తనను తమ జాతిపిత అని పిలుచుకుంటారు.
సేవాలాల్ జననం సేవాలాల్ మహారాజ్ 15 ఫిబ్రవరి 1739లో భీమా నాయక్,ధర్మిణీ బా య్ పుణ్య దంపతులకు అనంతపురం జిల్లా గుత్తి సమీపంలోని రాంజీ నాయక్ తండాలో జన్మించారు. తన యొక్క సిద్ధాంతాలు కేవలం మాటలకే పరిమితం కాకుండా ప్రతిదీ తాను చెప్పినది తన జీవితంలో ఆచరించి చూపించాడు. హిందూ ధర్మ రక్షణకై తన యొక్క శిష్యులతో కలిసి భారతదేశం మొత్తం తిరిగి హిందూ ధర్మం యొక్క గొప్పతనం ప్రజలకు తెలియపరుస్తూ హిందూ ధర్మంలో చొరబడిన పాశ్చాతా దురాచారాలను రూపుమాపుటకు ఎంతగానో కృషి చేశారు. విద్యానభ్యసించిన విధానం ఝామరీర్ ఝాల్ ( అడవి ప్రాంతం)అదొక భయంకరమైన అడవి. జంతువులకు ఆవాసం. అందులో సేవాలాల్ ఖాడు ( ఆవుల మంద)ను మేపుతుండేవారు. ఆ అడవి ఎవరికీ తెలియనటువంటి ప్రదేశంలో ఉంది. ఆ ప్రదేశంలో మేరమా సేవాలాల్ కి సకల విద్యలు నేర్పుతుంది. ఆ ప్రదేశం చుట్టూ కీకారణ్యం ఉంది. మధ్యలో విశాలమైన సుందర ప్రదేశం. ఆ ప్రదేశంలో మర్రిచెట్టు,అతి మనోహరమైన వాతావరణం. తుమ్మెదలా ఝాంకారాలతో కూడిన సంగీతం పక్కన సెలయేర్లు పారుతున్న సవ్వడి, కుందేలు పరుగులు, కోకిల రాగాలు, పురివిప్పి ఆడుతున్న Darling - ఇదంతా చూసే సేవాలాల్ సంతోషంతో పలకరించిపోయేవారు. తల్లిదండ్రుల సేవలోనూ, బంజారాల సేవలోను గడపడం చేత సేవాలాల్ ను భాయి అని పిలుస్తుండే వారు. కాలక్రమేనా" సేవా భాయి"గాను పిలువబడ్డారు. పేరుతో పిలవడం శుభం కాదని భావించిన బంజారా పెద్దలు సేవాలాల్ సేవాభాయ అని పిలుస్తుండేవారు. సేవాభాయ తెల్లని వస్త్రాలు ధరించేవారు. ఎర్రని రుమాలతో తలపాక చుట్టేవాడు. భుజాన పచ్చని రుమాలు ఉండేది చేతిలో కోల్డా( వెండి కంకణం ) డాంగ్ ( పొడవాటి కర్ర)ఉండేది. కోరికలను అధిగమించుట సేవాలాల్ మహారాజ్ ప్రజల సంక్షేమం కొరకు తను బ్రహ్మచారిగా జీవించారు తన జీవితకాలంలో జీవించినన్ని రోజులు ఎలాంటి ప్రలోభాలకు,వ్యామోహాలకు లొంగిపోకుండా తాను నమ్మిన సిద్ధాంతాల కొరకు జీవించారు.గౌతమ బుద్ధుని బోధనల వలె శాంతియుతంగా ఉండాలని జీవ హింస చేయరాదని కోరికలు మనిషి వినాశనం కు దారి తీస్తాయని, బంజారాలు మత్తు పానీయాలకు దూరంగా ఉండాలని, జీవితాన్నికో అర్థం ఉండేలా జీవించాలని, జంతుబలి సాంప్రదాయాన్ని విడనాడాలని ప్రేమగా మనం పెంచుకునే మూగజీవాలను దేవునికి నైవేద్యం పేరుతో బలి ఇవ్వడాన్ని వ్యతిరేకించారు. దేవతలు జీవులను రక్షిస్తారని జీవుల ప్రాణాలు రక్త, మాంసాలు కోరుకోరని హితువు పలికారు. కలరా వ్యాధి నుండి ప్రజల రక్షణ
తమ ప్రజల సంక్షేమం కొరకు సేవాలాల్ మహారాజ్ యుద్ధాలు కూడా చేయడము జరిగింది. బంజారాల ప్రధాన వృత్తిగా ఆవులను మేపుకొనెవారు అలా వస్తున్న తరుణంలో తెలంగాణ ప్రాంతాన్ని పాలిస్తున్న నిజాం రాజుల కాలంలో ఈ ప్రాంతంలో ఈ మధ్యకాలంలో కరోనా మహమ్మారి వలన ఎలాగైతే ప్రాణాలు విడిచిపెట్టి మన బంధువులు, పూర్వికులు, స్నేహితులు ప్రాణాలు కోల్పోయారో అప్పుడు కూడా నిజాం రాష్ట్రంలో కలరా వ్యాధి వ్యాపించి లక్షల ప్రాణాలు కోల్పోయి హైదరాబాదు నగరము అల్లకలోలానికి గురైంది. అప్పుడు సేవాలాల్ అనేక రకాల వ్యాధులకు తన యొక్క మేధాసంపతితో మందులను కనుక్కొని ఆ కాలంలో బహింకరమైన వ్యాధులను నయం చేయు సత్తా కలిగిన వ్యక్తి సేవలాల్ ఒక్కడే అది తెలుసుకున్న నిజాం ప్రభువు సేవాలాల్ తో వైద్యం చేయించి అటు ప్రజల ప్రాణాలు ఇటు నిజాం రాజులను కాపాడినందుకు గుర్తుగా వారి యొక్క చిత్రలేఖనం గీయించటంతో పాటు, ఇప్పటి బంజారాహిల్స్ ప్రాంతమును తమ ఆవుల మంద మేతకై ఇనాముగా ఇవ్వడంతో పాటు గోల్కొండ నాలుగు ద్వారాలలో ఒక ద్వారంకు సేవాలాల్ మహారాజ్ ద్వారం అని నామకరణము చేసి వారు ఎప్పుడు వచ్చినా ఆ ద్వారం తెరిచి ఉండే విధంగా అప్పటి నిజాం ప్రభువు సేవాలాల్ మహారాజ్ పై ఉన్నటువంటి…