కొడుకు గెలుపు కోసం తల్లిదండ్రుల ప్రచారం
తిరుమలగిరి 06 డిసెంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
పలు గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. బరిలో నిలబడిన అభ్యర్థులు మరియు వార్డు మెంబర్లు ఇంటింటికీ తిరగుతూ ప్రచారం చేస్తున్నారు. తమను గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని హామీలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుమలగిరి మండలం తొండ గ్రామంలో యువకుడు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి 6వ వార్డు మెంబర్ జేరిపోతుల శ్రీకాంత్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు అభ్యర్థితో పాటు తమ తల్లిదండ్రులు ఇద్దరు తమ కొడుకు గెలుపు కోసం పాటుపడాలని వార్డు అభివృద్ధికి తోడ్పడాలని తల్లిదండ్రులు వార్డు ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు...