జై భారత్ సామాజిక విప్లవ రణభేరి 2వ సభ పోస్టర్ ఆవిష్కరణ

Feb 21, 2026 - 19:16
Feb 21, 2026 - 20:17
 0  0
జై భారత్ సామాజిక విప్లవ రణభేరి 2వ సభ  పోస్టర్ ఆవిష్కరణ

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ జై భారత్ సామాజిక విప్లవ రణభేరి 2వ సభ పోస్టర్ ఆవిష్కరణ.ఆత్మకూరు ఎస్... గాంధీ , అంబేడ్కర్ల ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లే జైభారత్ సామాజిక విప్లవ రణభేరి 100 సభలను విజయవంతం చేయాలని జై భారత్ జాతీయ ఉపాధ్యక్షులు గుండువెంకన్న కోరారు. శనివారం మండల పరిధిలోని ఏపూరు గ్రామం లో జై భారత్ సామాజిక విప్లవ రణభేరి పోస్టర్ ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీ అంబేద్కర్ ల ఆశయాలను సాధించడానికి కుల మతోన్మాదాలను అరికట్టాలని లక్ష్యంతో రణభేరి తలపెట్టిన సభ పిబ్రవారి 24నసూర్యాపేట లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ దేశంలో కొన్ని శక్తులు గాంధీ అంబేద్కర్ల మధ్య వైర్యం ఉన్నదని వారు వేరువేరని ఆ మహనీయుల ఆశయాల పట్ల నమ్మకం ఉన్న ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆ మహనీయుల చరిత్రను వక్రీకరిస్తే జై భారత్ సామాజిక విప్లవ రణభేరి చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. చరిత్రను వక్రీకరించాలని ప్రజల మధ్య అశాంతిని సృష్టించే మనువాదులను ఎదుర్కోవడం కోసం ఈ రాష్ట్రంలో 100 సభల కార్యక్రమాన్ని జరుపుతున్నామన్నారు. ఈ సభలో ప్రజలు కుల మతాలకతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా పాల్గొని చైతన్యవంతులై ఈ దేశ చరిత్రను దేశాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జై భారత్ ఖధిజ్ఞాసి రాజు జై భారత్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, పల్లె కిరణ్ కుమార్ , మల్లయ్య, గణేష్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.