బిజెపి బీఆర్ఎస్ అభ్యర్థిగా కొత్త వెంకట్ రెడ్డి నామినేషన్

Dec 5, 2025 - 20:41
Dec 5, 2025 - 21:04
 0  143
బిజెపి బీఆర్ఎస్ అభ్యర్థిగా కొత్త వెంకట్ రెడ్డి నామినేషన్

05-12-2025 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం : చిన్నంబావి మండల పరిసర ప్రాంతమైన గూడెం గ్రామ సర్పంచ్ గా బిజెపి, బిఆర్ఎస్, బలపరిచిన అభ్యర్థి కొత్త వెంకట్రెడ్డి నామినేషన్ వేయడం జరిగింది.

 కొత్త వెంకట్ రెడ్డి ముందుగా గ్రామంలో ఉన్నటువంటి శ్రీ సీతారాముల వారిని దర్శించుకుని అక్కడి నుండి నేరుగా కార్యకర్తలతో బైక్ ర్యాలీ చేస్తూ గ్రామ దేవత అయిన సుంకులమ్మ దేవస్థానం దగ్గరికి చేరుకుని సుంకులమ్మ అమ్మవారి దగ్గర తీర్థ ప్రసాదాలు తీసుకుని అక్కడి నుండి ర్యాలీగా నామినేషన్ పత్రాలు తీసుకుని ఎన్నికల అధికారికి సమర్పించడం జరిగింది.

 కొత్త వెంకట్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో ఉన్నటువంటి నా కార్యకర్తలు నాపై ఉంచిన అభిమానంతో, నన్ను సర్పంచుకు పోటీ చేయిస్తున్న నా అభిమాన కార్యకర్తల అందరికీ నేను ముందుండి పని చేస్తానని చెప్పడం జరిగింది.

 వెంకట్ రెడ్డి తో పాటు గ్రామంలో ఉన్నటువంటి 10 వార్డ్ నెంబర్లు కూడా నామినేషన్ వేయడం జరిగింది.

 ఈ కార్యక్రమంలో కొత్త వెంకట్రెడ్డి తోపాటు, తోట బాలకృష్ణ, మద్దూరి శ్రీనివాసులు, మేకల శివ యాదవ్, మామిళ్ళపల్లి శ్రీనివాస్ సాగర్, మోషే మౌని  శివ కుమార్, కేతూరి మహేష్, డాక్టర్ కృష్ణ యాదవ్ గుమ్మడం శాంతయ్య , సింగోటం బాలస్వామి అబ్బాయిల గారి బుచ్చన్న , బత్తుల శేఖర్, భగవాన్ కొత్త రవీందర్ రెడ్డి, బోయ కురుమయ్య, షేర్ పల్లి నాగరాజు, బోయ వెంకటస్వామి, మేకల గోపాల్, గొందిపర్ల వెంకటేష్, షేర్ పల్లి వెంకటస్వామి, రాఘవేంద్ర శెట్టి, మోసమోని పార్వతమ్మ, తోట సరస్వతి, కుమ్మరి వెంకట రమణమ్మ,సింగోటం సరిత, మాధవి, ఈశ్వరమ్మ పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Vishnu Sagar Chinnamabavi Mandal Reporter Wanaparthi District Telangana State