ఎమ్మెల్యే సహకారంతో అభివృద్ధి చేస్తా సర్పంచ్ అభ్యర్థి శోభారాణి
విస్తృత ప్రచారంలో ముందుకు సాగుతున్న కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి జేరిపోతుల శోభారాణి
జన నిరాజనం పడుతున్న తొండ గ్రామ ప్రజలు
ఎమ్మెల్యే సహకారంతో తొండ గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తాను
గతంలో ఎంపీపీగా ఎన్నో సేవలు అభివృద్ధి కార్యక్రమాలు చేశాను
ఎమ్మెల్యే ప్రోత్సాహంతోనే నామినేషన్ వేసి ప్రచారం చేస్తున్నాను
ప్రజలు అఖండ మెజార్టీతో గెలిపిస్తారని ధీమా వ్యక్తం
తిరుమలగిరి 06 డిసెంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్:
తిరుమలగిరి మండలం తొండ గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి జేరిపోతుల శోభారాణి విస్తృతంగా ప్రచారంలో ముందుకు సాగుతూ గెలిచేది మా జెండానే మా పార్టీనే అని ధీమా వ్యక్తం చేశారు మొట్టమొదటిగా గ్రామ బొడ్రాయి వద్ద పూజలు చేసి అనంతరం భారీ ఎత్తున ప్రచారం మొదలుపెట్టారు ఈ సందర్భంగా గ్రామంలో ప్రజలతో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇందిరమ్మ ఇల్లు, ప్రజాపాలన ప్రభుత్వము ప్రతి పేదోడికి వెన్నుదన్ను ఉండి నీడనిచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ధీమా వ్యక్తంచేశారు. గతంలో ఎంపీపీ గా తొండ గ్రామాన్ని ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఘనత తమదే అని చెప్పారు. ఇప్పుడు గెలిపిస్తే ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో ఉంటూ ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తానని అన్నారు. ఎమ్మెల్యే మందుల సామేల్ ప్రోత్సాహంతోనే సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశానని వారి సహకారంతో ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, అభివృద్ధి పనులు చేయిస్తామని చేస్తారు నన్ను తొండ గ్రామ ప్రజలు ఆదరిస్తారని నమ్ముతున్నాను నా యొక్క ఉంగరం గుర్తు పైన ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపిస్తారని ఆశ భావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు వేల్పుల వెంకన్న బండారు సోమనారాయణ వేల్పుల రామాంజనేయులు వాసిరెడ్డి గోపాల్ రెడ్డి కొండ వీరయ్య మైనాల రాజయ్య కొండ సోమ నరసయ్య కొండ చంద్రయ్య గ్రామ శాఖ అధ్యక్షులు ఎల్లంల నాగరాజు గ్రామ యూత్ అధ్యక్షులు ముక్కెర మహేష్ పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు మూడ వెంకన్న మరియు వార్డు మెంబర్లు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ శాఖ నాయకులు తదితరులు పాల్గొన్నారు....