కుల నిర్మూలనా ఆచరణాత్మక కార్యక్రమంలో సత్యశోధన్ సమాజ్

Sep 29, 2024 - 20:23
Sep 29, 2024 - 20:47
 0  1
కుల నిర్మూలనా ఆచరణాత్మక కార్యక్రమంలో సత్యశోధన్ సమాజ్

తెలంగాణ వార్త ఆత్మకూరుయస్ కుల నిర్మూలనా ఆచరణాత్మక కార్యక్రమంలో భాగంగా జ్యోతిరావు పూలే స్థాపించిన సత్యశోధక్ సమాజ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆత్మకూర్ (ఎస్) గ్రామంలో సీపీఐ (ఏం.ఎల్)న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో సభ ను గునగంటి శ్రీను అధ్యక్షతన నిర్వహించారు. ఈ సభలో సీపీఐ (ఏం.ఎల్)న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఎం.డేవిడ్ కుమార్, ఐ ఎఫ్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి గంట నాగయ్య, ఐ ఎఫ్ టి యు జిల్లా ఉపాధ్యక్షులు కూనుకుంట్లా సైదులు, ఏ ఐ కె ఏం ఎస్ జిల్లా సహాయ కార్యదర్శి అల్గుబెల్లి వెంకటరెడ్డి,సాక్షి రిపోర్టర్ జలగం మల్లేష్,pow జిల్లా ప్రధాన కార్యదర్శి కంచర్ల నరసమ్మ,సబ్ డివిజన్ కమిటీ సభ్యులు డేగల వెంకట కృష్ణ,అరుణోదయ జిల్లా ఉపాధ్యక్షులు బోల్లె వెంకన్న,మల్కలపల్లి సైదులు, గఫార్, పగిడి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.సభ అనంతరం సహపంక్తి భోజనాలు కార్యక్రమం నిర్వహించారు.