ఎస్సి ఎస్టీ విద్యుత్ సంక్షేమ డైరీ అందజేసిన నాయకులు

విద్యుత్ శాఖ యాదాద్రి భువనగిరి ఎస్ఈ,ఎస్ఏఓ,డిఈటీ,డీఈ,లకు ఎస్సి ఎస్టీ విద్యుత్ సంక్షేమ డైరీ అందజేసిన నాయకులు

Jan 30, 2025 - 13:29
Jan 30, 2025 - 13:31
 0  13

అడ్డగూడూరు 29 జనవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా విద్యుత్ సూపరింటెండెంట్ ఇంజనీర్ సుదీర్ కుమార్, సీనియర్ అకౌంట్ ఆఫీసర్ హరీష్ కుమార్ డిఈ టెక్నికల్ శ్రీనివాస చారి,భువనగిరి ఆపరేషన్ డివిజన్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు గార్లకు ఎస్సీ ఎస్టీ విద్యుత్ ఉద్యోగుల సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు ఏంఆర్ రవీందర్ జెనరల్ సెక్రటరీ బోట్ల రాజేశ్వర్, భువనగిరి డివిజన్ అధ్యక్షులు సిలివేరు జైపాల్,వర్కింగ్ ప్రసిడెంట్ బాలెంల దుర్గయ్య,మహిళా విభాగం ప్రతినిధి యాట స్వరూప గార్ల ఆధ్వర్యంలో సంక్షేమ డైరీ అందిచడం జరిగింది.ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ..ఈ డైరీలో విద్యుత్ కార్మికుల యొక్క పూర్తి సమాచారం డాక్టర్"బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం హక్కులు ప్రకారం విధులను పొందుపరచడం జరిగింది.అన్ని జిఓ కాఫిలను ఉంచడం జరిగింది అని అన్నారు.ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు జెఏఓ నరేష్,ముక్క శ్రీనివాస్,ముక్క వెంకటయ్య,రమేష్ కుమార్, బాల నర్సింహా,మల్లేష్,గంగయ్య తదితర నాయకులు పాల్గొన్నారు.