బాల కార్మికులను పాఠశాలలో చేర్పించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ

Oct 8, 2025 - 18:52
 0  10
బాల కార్మికులను పాఠశాలలో చేర్పించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ

 జోగులాంబ గద్వాల 8 అక్టోబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి :  గద్వాల జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో రెస్క్యూ ఆపరేషన్ లో భాగంగా బుధవారం ధరూర్ మండలం పరిధిలో ఆయా గ్రామాలలో వ్యవసాయ పొలాలలో పనిచేస్తున్న ముగ్గురు బాల కార్మికులను గుర్తించి, సంబంధిత పాఠశాలలో చేర్పించారు. అలాగే పాతపాలెం లోని పొలం లో పనిచేస్తున్న ఒక బాల కార్మికుడిని డ్రాపౌట్ గుర్తించి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్స్ సభ్యులు మరియు చైల్డ్వెల్ఫేర్డిపార్ట్మెంట్ అధికారులు సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశా లలో అందించబడుతున్న మధ్యాహ్న భోజనంలో ఆహార నాణ్యత, విద్యార్థులకు మెనూ ప్రకారం బోజనం అందించాలని తెలిపారు.  ఈ సందర్భంగా లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్స్ మాట్లా డుతూ,   "బాలల శ్రమ నేరంగా మాత్రమే కాకుండా, వారి భవిష్యత్తును నాశనం చేసే ప్రమాదకరమైన అంశమని, ప్రతి ఒక్కరూ దీనిపై చైతన్యం కలిగి ఉండాలి" అని అన్నారు. ఈ కార్యక్రమంలో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్స్ వి. రాజేందర్, బి. శ్రీనివాసులు,  డి. లక్ష్మణ స్వామి మరియు చైల్డ్ వెల్ఫేర్ అధికారులు జయన్న, సురేష్ పాల్గొన్నరు.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333