కార్మిక హక్కులను కాలరాస్తున్న నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని గద్దె దించుతాం

చెడే చంద్రయ్య సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు

Jul 10, 2025 - 16:29
 0  109
కార్మిక హక్కులను కాలరాస్తున్న నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని గద్దె దించుతాం

అడ్డగూడూరు09 జులై 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– కేంద్ర కార్మిక సంఘాలు బుధవారం రోజు తలపెట్టిన దేశ వ్యాపిత సార్వత్రిక సమ్మె విజయవంతం అయిందని,కార్మిక హక్కులను కాలరాస్తున్న నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చేడే చంద్రయ్య పిలుపునిచ్చారు.సమ్మె సందర్భంగా అడ్డగూడూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఏఐటియుసి ఆశా వర్కర్స్ కార్మికుల ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చెడే చంద్రయ్య సీపీఐ మండల కార్యదర్శి రేఖల శ్రీనివాస్ జిల్లా సమితి సభ్యులు ఉప్పుల శాంతికుమార్ సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా చెడే చంద్రయ్య మాట్లాడుతూ..నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం అనుసరించిన ఆర్ధిక విధానాల కారణంగా,పేదరికం, అసమానతలు,ఆకలి,నిరుద్యోగం పెరిగాయన్నారు.మరొక వైపు,కార్పొరేట్ కుటుంబాల ఆస్తులు,సంపద ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయని, ఈ సంవత్సరం ఏప్రిల్ ఒకటి నుంచి నాలుగు కార్మిక కోడ్లను అమలుచేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించారన్నారు. కార్మికులు పోరాడి,అనేక త్యాగాలు చేసి సాధించుకున్న హక్కులన్నిటినీ రద్దు చేయడానికి నరేంద్రమోదీ ప్రభుత్వం కుయుక్తులు పన్నారన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని,సుప్రీంకోర్టు తీర్పులనూ,ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ మార్గదర్శకాలన్నిటినీ భూస్థాపితం చేయడమే పనిగా మోడీ ప్రయత్నం చేస్తున్నారన్నారు.కార్మిక కోడ్ లు అమలులోకి వస్తే 8గంటల పనిదినం,కనీస వేతనాలు,సామాజిక భద్రత, సంఘం పెట్టుకునే హక్కు సంఘాల రిజిస్ట్రేషన్లు-గుర్తింపు, సమిష్టి బేరసారాల హక్కు,సమ్మె హక్కు,ఆందోళనలు చేసే హక్కులు అన్నీ తీవ్రమైన ప్రమాదంలో పడిపోతాయని వారు ఆవేదన వ్యక్తంచేశారు. కార్మిక వర్గ హక్కులపై జరుగుతున్న దాడిని ప్రజలంతా ప్రజాస్వామ్యం పై దాడిగా భావించాలన్నారు.బీఎన్ఎస్ (భారతీయ న్యాయ సంహిత) చట్టాలను పౌర హక్కులపై దాడికి ప్రయోగిస్తున్నారని.బీఎన్ఎస్ చట్టంలోని సెక్షన్ 111 ప్రకారం, కార్మికులు సంఘటితంగా తమ హక్కులను డిమాండ్ చేస్తే,దాన్ని సంఘటిత నేరంగా పరిగణించి, తీవ్రమైన జైలుశిక్షలు,పెనాల్టీలు విధిస్తున్నారని ధ్వజమెత్తారు.కేంద్ర ప్రభుత్వ ఈ చర్యలన్నీ కార్పొరేట్లు అంబానీ, ఆదానీల ప్రయోజనాల కోసమే,చట్టాల సంస్కరణలు తీసుకువస్తున్నారని ధ్వజమెత్తారు.నాలుగు కార్మిక కోడ్ల రద్దుతో పాటు,రూ.26,000 కనీస వేతనం,8గంటల పనిదినం, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్,ఆశా, అంగన్వాడి తదితర స్కీం వర్కర్స్ రెగ్యులరైజేషన్,ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ సమావేశ నిర్వహణ, మరికొన్ని ముఖ్యంగా ఆశా వర్కర్స్ 18,000 ఫిక్స్డ్ వేతనం కల్పించాలని,వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ప్రమాద బీమా కల్పించాలని హెల్త్ కార్డులు ఇవ్వాలని ఈఎస్ఐ,పిఎఫ్ కల్పించాలని డిమాండ్ల సాధన కోసం ఈ సమ్మె జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు చెడిపల్లి రవీందర్ ఏఐటియుసి నాయకులు సుధాకర్ తరుణ్  ఏఐఎస్ఎఫ్ నాయకులు చిప్పలపల్లి వంశీ ఉప్పుల వంశీ  ఆశా వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షురాలు పసల మగ్దలీన ప్రధాన కార్యదర్శి,ఎడ్ల అమృత  సభ్యులు సిహెచ్ మంగమ్మ సరిత మహాలక్ష్మి ,ఆశా కార్యకర్తలు దుర్గమ్మ,మదనమ్మ,నాగమణి, సుమతి,శైలజ,శ్రీదేవి,ఇందిర, పుష్పలత,సునీత,స్వరూప, సురాంబా,సుజాత,స్వప్న,శోభ, భాగ్య,నాగలక్ష్మి,మధుర,సువర్ణ, అశ్వినితో పాటు 30 మంది కార్మికులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333