మల్దకల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికoగా సందర్శించి తనిఖీ చేసిన  *జిల్లా ఎస్పీ శ్రీ టి . శ్రీనివాస రావు,IPS 

Jul 10, 2025 - 16:26
 0  4
మల్దకల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికoగా సందర్శించి తనిఖీ చేసిన  *జిల్లా ఎస్పీ శ్రీ టి . శ్రీనివాస రావు,IPS 
మల్దకల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికoగా సందర్శించి తనిఖీ చేసిన  *జిల్లా ఎస్పీ శ్రీ టి . శ్రీనివాస రావు,IPS 

జోగులాంబ గద్వాల 9 జూలై 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ  ఆకస్మికంగా సందర్శించి స్టేషన్   రికార్డ్స్ ను, స్టేషన్ పరిసరాలను మరియు పోలీస్ స్టేషన్ లో  సిబ్బంది నిర్వహిస్తున్న విధులను తనిఖీ చేశారు.  అందులో భాగంగా    పోలీస్ స్టేషన్ పరిసరాలను, రిసెప్షన్, స్టేషన్ రైటర్,  టెక్ టీమ్, ఎస్ హెచ్ వో,  మెన్ రెస్ట్ రూమ్ , లాక్ అప్ రూమ్ ను పరిశీలించారు. స్టేషన్ లో రోజు వారీగా నిర్వహిస్తున్న  జనరల్ డైరీ, బీట్ డ్యూటీ బుక్స్, సుపీరియర్ ఆఫీసర్స్ విసిటింగ్ బుక్స్ తదితర రికార్డ్స్ ను తనిఖీ చేశారు.  

  ఈ సందర్భంగా ఎస్పీ   స్టేషన్ సిబ్బందితో మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ పరిసరాలను నిత్యం పరిశుభ్రంగా ఉంచుకోవాలని, స్టాఫ్ కు ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకవచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు.  పోలీస్ స్టేషన్ లో ఎంత మంది సిబ్బంది ఉన్నారు, వారు ఏ ఏ విధులు నిర్వహిస్తున్నారో పరిశీలించారు.  పోలీస్ స్టేషన్ నుండి రోజు ఎన్ని బ్లూ కోల్ట్స్, పెట్రో కార్స్ విధులు నిర్వహిస్తున్నాయని, పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కడెక్కడ ఎన్ని బిట్స్ నడుస్తున్నాయని తెలుసుకొని ప్రాపర్ గా పెట్రోలింగ్ నిర్వహిస్తూ దొంగతనాలు జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు.  విసృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టి రోడ్డు ప్రమాదాలను నియంత్రించాలని అన్నారు,  డయల్ 100 కాల్ రాగానే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సమస్య పరిష్కరించాలని, బ్లూకోల్ట్స్, పెట్రోల్ కార్ నిరంతరం 24x7 గస్తీ నిర్వహించాలని ,  సిబ్బంది తమకు కేటాయించిన గ్రామాలలో పూర్తి సమాచారం సిబ్బంది అందరి దగ్గర ఉండాలని, తరచూ గ్రామాలను సందర్శించి సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాల పై ,మాదాకా ద్రావయాలు పై అవగాహన కల్పించాలని అన్నారు.  ప్రజలకు ఎప్పుడు అందుబాటులో వుంటూ ప్రజల సమస్యలను తీర్చాలని, ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని సూచించారు. 

ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,ఎస్సై నందికర్,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333