కామ్రేడ్ ఉప్పల కాంతారెడ్డి పార్టీకి అందించిన సేవలు మరవలేనివి....
మునగాల 09 జనవరి 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : సిపిఐఎం సీనియర్ నాయకులు కామ్రెడ్ వుప్పుల కాంతారెడ్డి పార్టీ కి అందించిన సేవలు అద్వితీయ మని పార్టీ గ్రామ శాఖ కార్యదర్శు లు గడ్డం వినోద్,కిన్నెర వెంకన్న అ న్నారు.శుక్రవారం మునగాల లో కాంతారెడ్డి మూడవ వర్దంతి సభ ను నిర్వహించారు.ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ తుదిశ్వా స విడిచే వరకు పార్టీ ప్రజా సం ఘాల బలోపేతానికి ఆయన ఎం తో కృషి చేశారని కొనియాడారు. మునగాల పరగణా లో కమ్యూనీ ష్టు పార్టీ చరిత్ర ను అజేయంగా ని లిపారని గుర్తు చేశారు.సుమారు ఆరు దశాబ్దాల పాటు పార్టీ కి అం కిత మై పనిచేశారని చెప్పారు.ఎ న్ని నిర్బంధాలు ఎదురైనప్పటికి మొక్కపోని ధైర్యం తో ఎత్తి జం డాను దించకుండా ముందుకు సా గారని గుర్తుచేశారు.పార్టీ ఉమ్మడి జిల్లా కమిటీ సభ్యులు గా,రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు గా,పార్టీ కోదాడ డివిజన్ కార్యద ర్శిగా సుదీర్ఘ కాలం పనిచేశారని చెప్పారు.పార్టీ లో గుర్తింపు కలిగి న నాయకుల్లో కాంతారెడ్డి ఒకరని చెప్పారు.పది సంవత్సరాల పా టు మునగాల సర్పంచ్ గా,ఇరవై సంవత్సరాలు మునగాల సింగిల్ విండో చై ర్మన్ గా,ఐదు దశాబ్దాల పాటు మునగాల లిప్టు చైర్మైన్ గా పని చేసి ఉమ్మడి జిల్లాలో అన్ని పార్టీ ల వారికి సుపరిచుతులుగా వున్నారని తెలిపారు.ఆయన ఆశ య సాధన కు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపు నిచ్చారు.ఈ కార్య క్రమంలో బిఆర్ఎస్ నాయ కులు కందిబండ సత్యనారాయ ణ,బిఆర్ఎస్ గ్రామ శాఖ అద్యక్షు లు వుడుం కృష్ణ,గ్రామ ఉప సర్పం చ్ కాసర్ల వెంకట్,వార్డు మెంబర్లు దేవరం శ్రీనివాస రెడ్డి, వల్లోజు వ సంత కుమార్,గడ్డం వెంకటేశ్వర్లు, ఇటికాల వెంకయ్య,గడ్డం వెంకన్న
పాల్గొన్నారు.