ప్రజలు చట్టంపై నమ్మకతో ఉండాలి...... సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్

Jan 9, 2026 - 18:24
Jan 9, 2026 - 19:51
 0  2
ప్రజలు చట్టంపై నమ్మకతో ఉండాలి...... సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్

మునగాల 09 జనవరి 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : _మునగాల పోలీస్ స్టేషన్ పరిధి నారాయణగూడెం గ్రామంలో బాధితులను పరామర్శించి, భరోసా కల్పించిన జిల్లా ఎస్పీ నర్సింహా ఐపీఎస్ ..

సర్పంచ్ ఎన్నికల సమయంలో నారాయణగూడెం గ్రామంలో షెడ్యూల్డ్ క్యాస్ట్ వర్గం పై జరిగిన దాడి ఘటనకు సంబంధించి జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్  బాధితుల ఇండ్లకు స్వయంగా వెళ్లి గాయపడిన వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ  బాధితులతో మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం బలమైన కేసు నమోదు చేశామని దీనిలో 11 మంది నిందితులను చేర్చామని ఈ కేసును పారదర్శకంగా వేగంగా దర్యాప్తు చేసి త్వరితగతిన వారికి చట్టపరమైన శిక్షలు అమలయ్యేలా కృషి చేస్తామని తెలిపారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం చాలా శక్తివంతమైనది చట్టంపై నమ్మకం ఉంచాలి అని కోరారు. గ్రామంలో నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాం గ్రామంలో పూర్తిస్థాయి నిగా ఉంచాం, ఎవరు అధైర్యపడవద్దని భరోసా కల్పించారు. చట్టంపై నమ్మకంతో ఉండాలని కోరారు, ఎదురుదాడికి పాల్పడి కేసులపాలు కావద్దని సూచించారు. గ్రామంలో శాంతియుత వాతావరణం కోసం పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. దైర్యంగా రోజువారీ పనులు చేసుకోవాలి అని సూచించారు. గ్రామంలో అందుబాటులో ఉండాలని గ్రామంలో కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని, నిరంతర పెట్రోలింగ్ చేయాలని స్థానిక ఎస్ఐ, సిఐ లకు సూచనలు చేశారు. నిదితులను 5 లక్షల రూపాయలకు బైండోవర్ చేయడం జరుగుతుంది అన్నారు. షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబల్, బబడుగు బలహీన వర్గాలు, మహిళలు, వృద్దుల రక్షణలో పోలీసు వేగంగా స్పందిస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్పి  వెంట కోదాడ డివిజన్ డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, మునగాల సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణా రెడ్డి, మునగాల ఎస్ఐ ప్రవీణ్ కుమార్, పోలీసు సిబ్బంది ఉన్నారు.

A Sreenu Munagala Mandal Reporter Suryapet District Telangana State