డాక్టర్ శివంగ విజయ్ గౌడ్ కు ఆత్మీయ సన్మానం

Feb 11, 2025 - 14:48
Feb 11, 2025 - 14:57
 0  4
డాక్టర్ శివంగ విజయ్ గౌడ్ కు ఆత్మీయ సన్మానం

 హైదరాబాద్,11 ఫిబ్రవరి 2025 తెలంగాణవార్త ప్రతినిధి:-హైదరాబాద్ మహానగరంలో నాగోల్ లో గల సుప్రజా హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ విజయ్ గౌడ్ వైద్య మరియు సామాజిక సేవ రంగంలో ఇటీవల కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు లో "రాయల్ అకాడమీ యూనివర్సిటీ "వారు గౌరవ డాక్టరేట్ ప్రధానం చేశారు డాక్టరేట్ స్వీకరించిన సందర్భంగా ఈరోజు మాదిగ కళామండలి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మల్లెపాక అనిల్ కుమార్ డాక్టర్ విజయ్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకే అందజేసి శాలువాతో ఆత్మీయ సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం కళామండలి రాష్ట్ర అధ్యక్షులు మల్లెపాక అనిల్ కుమార్ మాట్లాడుతూ డాక్టర్ విజయ్ గౌడ్ వైద్య మరియు సామాజిక రంగంలో విశిష్ట సేవలు అందించి ఎంతోమంది బీద పేద ప్రజలకు వైద్య మరియు సామాజిక సేవలు అందించారు వారి సేవలకు గుర్తింపుగా గౌరవ డాక్టరేట్ స్వీకరించడం అభినందనీయం అన్నారు భవిష్యత్తులో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలని తమ సమాజ అభివృద్ధి కోసం కృషి చేయాలి అని అన్నారు ఈ కార్యక్రమంలో హోప్ స్వచ్ఛంద సేవా సమితి మరియు సింధు ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు దైద వెంకన్న డాక్టర్ పుట్టల మల్లేష్, హోప్ మరియు సింధు ఆర్ట్స్ అకాడమీ రంగారెడ్డి జిల్లా కోఆర్డినేటర్ నీరుడు విజయ్ అభిషేక్ చందన్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333