కాంగ్రెస్ హయాంలో చేసిన అభివృద్దే గ్రామాల్లో కనిపిస్తుంది

Apr 30, 2024 - 21:00
 0  10
కాంగ్రెస్ హయాంలో చేసిన అభివృద్దే గ్రామాల్లో కనిపిస్తుంది

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ .కాంగ్రెస్ హయాంలో చేసిన అభివృద్దే గ్రామాల్లో కనిపిస్తుంది మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి.. ఆత్మకూర్ ఎస్... పదేళ్లు కాంగ్రెస్ పార్టీ మరో 10 ఏళ్లు టిడిపి పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ దశాబ్దాలుగా అభివృద్ధి చేసిన కాంగ్రెస్ పార్టీ పథకాలే గ్రామాల్లో నేటికీ దర్శనమిస్తున్నాయని మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి అన్నారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా మండల పరిధిలోని నిమ్మికల్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశానికి స్వాతంత్ర దినోత్సవ కాంగ్రెస్ పార్టీ గ్రామాల అభివృద్ధికి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదల బతుకులు వెలుగును నింపింది అన్నారు. మాయమాటలు చెప్పి మధ్యలో అధికారంలోకి వచ్చిన తోక పార్టీలు కాలగర్భంలో గల్లంతవుతుంటే చూస్తున్నామన్నారు. నల్గొండ పార్లమెంట్ అభ్యర్థిగా తన కుమారుడు రఘువీర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించి ఢిల్లీ పార్లమెంటు భవనంలో నల్లగొండ జిల్లాకు మంచి గుర్తించవలసిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి మాట్లాడుతూ సూర్యాపేట నియోజకవర్గంలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం ఎన్ని ఉద్యమాలు త్యాగాలు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందని నియోజకవర్గంలో 40 వేల ఓట్ల మెజార్టీ రఘువీర్ రెడ్డికి ఇస్తామని హామీ ఇచ్చారు. నల్గొండ పార్లమెంట్ అభ్యర్ది రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ తరఫున సంక్షేమ పథకాల అధ్యయనా పార్లమెంటులో గల వ్యక్తి పోరాటం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రముఖ జర్నలిస్టు పట్టణ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో లేకుంటే భారతీయులు బానిసలుగా ఉండేవారన్నారు. అధికారంలోకి రావాలని బిజెపి ప్రజలకు మాయమాటలు చెప్పి అలవికాని హామీలతో ప్రజలను మరోసారి మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ప్రజలు ఇది గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వేదాసు వెంకయ్య, పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, మరి కొందరు ముఖ్యులు మాట్లాడారు. ఈ సందర్భంగా కందగట్ల మంగలి తండాకు చెందిన పలువురు నాయకులు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. ఈ కార్యక్రమంలో సర్వోత్తమ్ రెడ్డి కొప్పల వేనారెడ్డి, పోతు భాస్కర్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెవిటి వెంకన్న, మండల పార్టీ అధ్యక్షులు కందాల వెంకటరెడ్డి, కాకి కృపాకర్ రెడ్డి, పెద్దిరెడ్డి రాజా, గోదాల రంగారెడ్డి, సామ మల్లారెడ్డి, పచ్చిపాల వెంకన్న, శనగని రాంబాబు, బైరు దుర్గయ్య, అనురాధ, పాండు నాయక్, శిగ శ్రీనివాస్, రాజు, బీరెల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎల్లా చారి, రామ్ రెడ్డి సత్యం శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.