పేద కుటుంబాన్ని వరించిన సోషల్ వెల్ఫేర్ ఉద్యోగం.*

Sep 21, 2024 - 19:58
 0  0
పేద కుటుంబాన్ని వరించిన సోషల్ వెల్ఫేర్ ఉద్యోగం.*

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ పేద కుటుంబాన్ని వరించిన సోషల్ వెల్ఫేర్ ఉద్యోగం.* ఆత్మకూర్ ఎస్.. "జీవితమే ఒక ఆట సాహసమే పూబాట" ఆత్మకూరు ఎస్ మండలం గట్టిగల్లు గ్రామానికి చెందిన ఓ యువకుడు పోస్ట్ గ్రాడ్యుయేట్ వరకు చదివి ప్రైవేట్ పాఠశాలల్లోనూ కళాశాలల్లో పని చేస్తూ తెల్లవారకముందే ఇల్లుఇల్లు తిరిగి పాలు తెచ్చి అమ్మే ఆ యువకుడు సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ గా ఎంపికయ్యాడు. శనివారం వచ్చిన సోషల్ వెల్ఫేర్ పరీక్ష ఫలితాల్లో గాదె కోటేష్ స్టేట్ 37వ ర్యాంకు సాధించాడు. రోజుకు సుమారు 30 కిలోమీటర్లు పాలకేండ్లతో వచ్చి 8 గంటల్లోగా పాలను కొని తొమ్మిది గంటల వరకు తాను పనిచేసే ప్రైవేటు కళాశాలకు వెళ్లి లెక్చరర్ గా పనిచేసే ఆ యువకుడు నేడు సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్గా ఉద్యోగం సంపాదించాడు. నిరుపేద దళిత కుటుంబానికి చెందిన గాదె కోటేష్ చిన్నప్పటినుంచి కష్టపడి చదువుకొని ఉద్యోగ రాదేమోనని భావించి ప్రైవేట్ పాఠశాలల్లో కళాశాలలో విద్యాబోధనలు చేస్తూ కరుణ సమయంలో విద్యాసంస్థలు సరైన వేదన ఇవ్వకపోవడంతో పాల వ్యాపారం చేసుకుంటూ చదువును కొనసాగించాడు. 2022లో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఈ ఏడాది జూన్లో సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగానికి పరీక్ష రాసి శనివారం విడుదలైన ఫలితాలలో సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ గా కోటేష్ ఎంపిక అయ్యాడు. గాదే బిక్షం లక్ష్మమ్మల రెండో కుమారుడైన కోటేష్ స్వశక్తితో ఉద్యోగం సంపాదించి తన తోటి వారికి ఆదర్శంగా నిలిచాడు. పోస్ట్ గ్రాడ్యుయేట్ వరకు చదివిన కొటేష్ 2013 నుండి ప్రైవేట్ బి.ఎడ్ కాలేజీ లో పని చేసిన 2022 లో సోషల్ వెల్ఫేర్ నోటిఫికేషన్ విడుదల కాగా అప్పటినుండి వాయిదా పడి ఈ ఏడాది జూన్ 26న పరీక్షలు నిర్వహించారు. పరీక్షలు కోటేష్ కు 37వ ర్యాంక్ స్టేట్ వచ్చింది యాదాద్రి భువనగిరి జోన్ -5 లో 9 వ ర్యాంక్ సాధించాడు. 2020 కరోనా టైం లో డైరీ ఫాం పెట్టి గట్టికల్లు తోపాటు పరిసర గ్రామాలలో పాలు తెచ్చి సూర్యాపేట, కుడ కుడ,పిఎన్ఆర్ టౌన్షిప్లలో ఇల్లిల్లూ తిరిగి పాలు పోసేవాడు. మళ్లీ తొమ్మిది గంటలకి ప్రైవేట్ కళాశాలకు వెళ్లి విద్యార్థులకు విద్యాబోధన చేసేవాడు. తన మొబైల్ ఫోన్ లోని రింగ్టోన్కు వచ్చే పాటకు కోటేష్ జీవిత భవిష్యత్తుకు దగ్గర సంబంధం ఉండడంతో పలువురు కొటేష్ ను అభినందించారు.