కాంగ్రెస్ గాలానికి చిక్కిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
హైదరాబాద్:ఆగస్టు 24
తెలంగాణ రాష్ట్రంలో వాస్తవానికి బీఆర్ఎస్ విలీనానికి స్కెచ్ వేసింది కాంగ్రెస్. కానీ గులాబీ కండువా మార్చాలంటే ఆలోచిస్తున్నారు ఎమ్మెల్యే లు. ఎంత ట్రై చేసినా బీఆర్ఎస్ ఎల్పీ విలీనం అయ్యే పరిస్థితులేవీ కనిపించడం లేదు.
దీంతో జరిగింది ఏదో జరిగిపోయింది.. ఇక ఎంత మంది వస్తే అంతమందిని చేర్చుకుందామని కాంగ్రెస్ ఫిక్స్ అయిపోయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యం లోనే మరో ఐదారుగురు కారు పార్టీ ఎమ్మెల్యేలతో టచ్ లోకి వెళ్లింది
లోక్ సభ ఎన్నికలు ముగిశా యి. సీఎం అమెరికా టూర్ అయిపోయింది. రాజ్యసభ ఎన్నికా పూర్తయింది. ఇక ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలే కాంగ్రెస్ టార్గెట్. అందుకే ఆపరేషన్ ఆకర్ష్ 2.Oకు స్కెచ్ వేస్తోంది
కాంగ్రెస్. కారు పార్టీ దాడి రోజురోజుకు పెరిగిపోతుం డటంతో.. మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గాలం వేస్తోంది. వీరు కారు దిగేస్తే అది స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి పెద్ద దెబ్బ అవుతుందన్నది కాంగ్రెస్ వ్యూహం. దానం నాగేందర్ తో పాటు ఇప్పటికే 10 మం ది కారు పార్టీ ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరారు.
ఇంకా 16 మంది ఎమ్మెల్యే లు కాంగ్రెస్ లో చేరితే BRS LP విలీనం అవుతుంది. రేపో మాపో కాంగ్రెస్ గూటి కి..అయితే అంతమంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరేందుకు రెడీగా లేకపోవడంతో.. రూట్ మార్చింది కాంగ్రెస్.
ఎంతమంది వస్తే అంత మందిని చేర్చుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే మరో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్లకు రేపో మాపో కండువా కప్పేందుకు రెడీ అవు తున్నారు.
హస్తం పార్టీ లీడర్లు. వీరితో పాటు మరికొందరితోనూ చర్చలు సాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆ ఎమ్మెల్యేలె వరన్నదే ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.
నలుగురిలో ముగ్గురి చేరికకు గ్రీన్ సిగ్నల్…?
జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, ఆలంపూర్ ఎమ్మెల్యే విజేయుడు, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తో పాటు గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది.
ఇందులో ముగ్గురిని చేర్చుకునేందుకు హస్తం పార్టీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన ఆ ఎమ్మెల్యేపై పలు ఆరోపణ లు ఉండటంతో.. కండువా కప్పాలా వద్దా అని కాంగ్రెస్ నేతలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.