అర్హులైన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు 

Mar 2, 2024 - 20:30
 0  13
అర్హులైన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు 

• కార్యాచరణతో వస్తే జేఎన్బీ స్థలాలపై నిమిషంలో సంతకం 

• ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హామీ 

స్థలాలు ప్రభుత్వం సమకూరుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్టుల(జేఎన్డే) హౌసింగ్ సొసై టీకి సంబంధించి ఇళ్ల స్థలాల అప్పగింతపై రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డితో జేఎనో ప్రతినిధులు చర్చించి ఒక రోడ్మ్యాప్తో తన దగ్గరకు వస్తే ఒక్క నిమిషంలో సంబంధిత ఫైలుపై సంతకం చేస్తానని ముఖ్య మంత్రి చెప్పారు. రాష్ట్రంలో ఏ సంస్థకు నామినేటెడ్ చైర్మన్ నియమించ కుండా కేవలం మీడియా అకాడమీకే శ్రీనివాస్డ్డిని చైర్మెన్గా నియమిం చామంటే తమ ప్రభుత్వం జర్నలిస్టులకు ఎంత ప్రాధాన్యం ఇస్తుందో స్పష్ట మవుతోందని అన్నారు. శుక్రవారం సాయంత్రం జేఎన్జలో సభ్యులైన అన్ని పత్రికల, టీవీ మీడియాకు చెందిన ప్రతినిధులు సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. జేఎన్జకు కేటాయించిన ఇళ్ల స్థలాల అప్పగింత ప్రక్రియ వంద రోజుల్లోగా మొదలు పెడతానన్న హామీని అమలు చేసినం దుకు కృతజ్ఞతలు తెలిపారు. సొసైటీకి 16 ఏళ్ల కిందట కాంగ్రెస్ ప్రభు త్వమే నిజాంపేట, పేట్బషీరాబాద్లో 70 ఎకరాల స్థలాన్ని జేఎన్జకు కేటాయించిందని ప్రతినిధులు సీఎంకు తెలిపారు. ఆ తరువాత జరిగిన పరిణామాలతో సొసైటీకి స్థలాన్ని అప్పగించాలని సుప్రీంకోర్టు ఆదేశాలి చ్చినా గత ప్రభుత్వంలో ఈ తీర్పు అమలుకాలేదన్నారు. ఇప్పటి వరకు ఈ స్థలాన్ని కాపాడుకుంటూ వచ్చామని వారు వివరించారు. ఈ సంద ర్భంగా రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అర్హులైన మిగిలిన జర్నలి స్టులకు కూడా స్థలాలు ఇచ్చే విషయంలో మీడియా అకాడమీతో చర్చించి కార్యాచరణ రూపొందిస్తే వారికి కూడా స్థలాలను ఇస్తామని పేర్కొన్నారు. జర్నలిస్టుల ఆరోగ్యభద్రతా కార్డులతోపాటు ఇతర సమస్యలపైనా దృష్టిసా రించామని తెలిపారు. సమావేశంలో ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. సీఎం ఆదేశాలకు అనుగుణంగా స్థలాల విషయంలో వెంటనే నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి సలహా దారు వేం నరేందర్రెడ్డి పాల్గొన్నారు..

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333