నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన ఆర్డీవో

Jan 30, 2026 - 16:49
 0  253
నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన ఆర్డీవో

తిరుమలగిరి 30 జనవరి 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని సూర్యాపేట జిల్లా ఆర్డీఓ వేణు మాధవ రావు అధికారులకు సూచించారు. స్థానిక మండల కేంద్రంలోని మహిళా మండల సమైక్య కార్యాలయాన్ని సందర్శించి నామినేషన్ల స్వీకరణ, ఇతర ఏర్పాట్లను పరిశీలించారు. నామినేషన్లు, అభ్యర్థుల తుది జాబితా, పోలింగ్‌ కేంద్రాల్లో ఏర్పాట్లు, ఓటింగ్‌ నిర్వహణ, తదితర అంశాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రిటర్నింగ్ అధికారులు, మున్సిపల్ కమిషనర్ రామచంద్రారావు తహసిల్దార్ హరిప్రసాద్ ఎంపీడీఓ లాజర్ సీఐ నాగేశ్వరరావు డిప్యూటీ తహసిల్దార్ జాన్ మొహమ్మద్ పాల్గొన్నారు.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి