చిన్నారులను బడిలో చేర్పించిన అధికారులు

జోగులాంబ గద్వాల జిల్లా సెప్టెంబర్ 18 (గురువారం) : జోగులాంబ గద్వాల జిల్లా మండల పరిధిలోని పూజారి తాండ, గువ్వలదిన్నె గ్రామం ,డ్రాప్ అవుట్ విద్యార్థులను గుర్తించి. పొలాల వద్దకు వెళ్లివిద్యార్థుల తల్లిదం డ్రులకు విద్య పైన అవగాహన కల్పించడం జరిగింది. విద్యతో ఉన్నత శిఖరాలను చేరుకుంటారు. విద్యకు పేదరికం అడ్డు రాకూడదు , ప్రభుత్వం మీలాంటి వారి కోసమే ఉచిత విద్యను ప్రవేశపెట్టిందని తల్లిదండ్రులకి అవగాహన కల్పించి. తిరిగి స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో నందిన్నె జిహెచ్ఎంసి విజయ్ భాస్కర్, చైల్డ్ ప్రొటెక్షన్ ప్రతినిధులు పద్మ, సరాగిణి, పాఠశాల బృందం, అయేషా, సిఆర్పి శివరాజ్ కుమార్, రాధికలు పాల్గొన్నారు.