**డ్రగ్స్ మరియు గంజాయి రహిత సమాజం కోసం కృషి""సీఐ నరసింహారావు నూతనకల్ పిఎస్*
తెలంగాణ వార్త ప్రతినిధి నూతనకల్ :*డ్రగ్స్ మరియు గంజాయి రహిత సమాజం కోసం కృషి -- CI నరసింహారావు*.
మాదకద్రవ్య రహితంగా తీర్చిదిద్ధేందుకు ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమైనదని తుంగతుర్తి సర్కిల్ ఇన్స్‌పెక్టర్ నరసింహారావు అన్నారు.
అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక అవగాహన కార్యక్రమాల నిర్వహణలో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నూతనకల్ మండల కేంద్రంలో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్‌పెక్టర్ మాట్లాడుతూ సరదా కోసం మొదలైన అలవాటు.. మత్తులోకి నెడుతోందని, గతంలో సిగరెట్, మద్యంతో సరిపెట్టుకునే యువత.. ఇప్పుడు నిషా కోసం గంజాయి, మాదకద్రవ్యాల బారినపడి మత్తుకు బానిసలవుతున్నారని అన్నారు. సమాజంలోని మాదకద్రవ్యాల ముప్పును అంతం చేసే లక్ష్యంతో జిల్లా ఎస్పి గారు ఆదేశాల మేరకు ఇప్పటికే పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా నిర్మూలన కోసం నషాముక్త్ భారత్ అభియాన్ ద్వారా ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు.. గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలకు నేటి యువత బానిసలై తమ ఉజ్జ్వల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సై ప్రవీణ్ కుమార్ ప్రజలు పౌరులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు