బాధ్యతలు స్వీకరించిన నూతన రెవెన్యూ అదనపు కలెక్టర్
జోగులాంబ గద్వాల 21 ఫిబ్రవరి 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- జిల్లా నూతన రెవెన్యూ అదనపు కలెక్టర్ గా ముసిని వెంకటేశ్వర్లు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన అదనపు కలెక్టర్ల బదిలీల్లో ముసిని వెంకటేశ్వర్లు బదిలీ పై జోగులాంబ గద్వాల్ జిల్లాకు అదనపు కలెక్టర్ గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ని మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకే అందజేసి,శాలువా తో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన చాంబర్ కు చేరుకుని బాధ్యతలు చేపట్టారు.