చెరువు తూము తీసి నీటిని దిగువతు వొదులుతున్న దృశ్యం

Mar 6, 2024 - 19:04
 0  5
చెరువు తూము తీసి నీటిని దిగువతు వొదులుతున్న దృశ్యం

తెలంగాణ వార్త ఆత్మకుర్ యస్ తూము తీసి నీటిని తరలిస్తున్నారు ఆత్మకూర్ ఎస్... అసలే ఎండలు ఆపై నీటి కొరత వ్యవసాయమనికే కాదు తాగునీటికి సైతం నీటికి కటకట ఏర్పడుతుంది. మునిగినట్లపై తాటి పండు పడ్డట్టుఒక వైపు నీటి సమస్యలతో రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతుండగా చెరువులో ఉన్న కొద్దిపాటి నీటిని తుముతో తరలిస్తున్న సంఘటన మండల పరిధిలోని ముక్కుడుడేవులపల్లి లో బుదవారం ఊర చెరువు తూము నుండి గుర్తు తెలియని వ్యక్తులు నీటిని వదిలారు. చాపలపట్టేందుకు గతం లో చాపల కాంట్రాక్టర్ కొంత నీటిని కాలి చేయగా గత రెండు రోజులు గా తూము ద్వారా నీటిని తరిలించి నట్లు స్థానికులు ఆరోపించారు. వెంటనే అధికారుల కు స్థానికులు సమాచారం ఇవ్వడం తో కొంత తూమును మూసి కొద్దిపాటి నీటిని తరలిస్తున్నట్లు ఆరోపించారు. వెంటనే అధికారులు తుమును మూసి నీటిని కాపాడాలని కోరుతున్నారు.