జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణ లక్ష్యాన్ని పూర్తి చేయాలి కలెక్టర్.

Sep 21, 2024 - 19:38
 0  4
జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణ లక్ష్యాన్ని పూర్తి చేయాలి కలెక్టర్.

జోగులాంబ గద్వాల 21 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- గద్వాల. జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణ లక్ష్యాన్ని పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ అధికారులకు ఆదేశించారు.శనివారం ఐ.డి.ఓ.సి కాన్ఫరెన్స్ హాల్‌ నందు ఆయిల్ ఫామ్ సాగు పై ఉద్యానవాన,వ్యవసాయ,  గ్రామీణాభివృద్ధి  అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆయిల్ పామ్ తోటల పెంపక విస్తీర్ణం పెంచడానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. జిల్లాలో 10,000 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయడానికి నిర్ణయించగా, ప్రస్తుతం 6,500 ఎకరాలలో సాగు చేయుటకు గుర్తించడం జరిగిందని, మరో 4,000 ఎకరాలలో  సాగు చేసేందుకు ఆ రైతులను ప్రోత్సహించాలని, తద్వారా గద్వాల జిల్లాలో ఆయిల్ పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడానికి అవకాశం ఉందని అన్నారు.  దీని ద్వారా స్థానిక రైతులకు మార్కెటింగ్ సౌకర్యాలు మెరుగుపడతాయని, ఆయిల్ పామ్ సాగుకు రైతులను గుర్తించి వారికి అవగాహన కల్పించి, తగిన మార్గదర్శకాలు ఇవ్వాలని అన్నారు. పంట సాగు ప్రక్రియ, సబ్సిడీలతో సహా అన్ని వివరాలను రైతులకు వివరించాలని అధికారులకు ఆదేశించారు.ఆయిల్ ఫామ్ సాగు ప్రారంభ దశలో ఉన్నప్పుడు అంతర పంటల ద్వారా కూడా ఆదాయం పొందవచ్చని,  రైతులు ఇతర పంటలను కూడా సాగు చేయవచ్చని, ఈ విషయంపై మండల స్థాయి వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. రైతులను ప్రోత్సహించడానికి, ఇప్పటికే విజయవంతంగా ఆయిల్ పామ్ సాగు చేసిన రైతులను రోల్ మోడల్‌గా చూపించాలని, తద్వారా ఇతర రైతులు కూడా సాగుకు ముందుకొచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు . అధికారులు రైతులకు ఆయిల్ పామ్ సాగు ద్వారా పొందే ఆదాయం, లాభ, నష్టాల గురించి స్పష్టంగా వివరించాలని అన్నారు.బ్యాంకర్లు రైతులకు అవసరమైన రుణాలు, సబ్సిడీలు అందజేయాలని సూచించారు. గ్రామీణ అభివృద్ధి సంస్థ కూడా భాగస్వామిగా పనిచేసి మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కింద ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించేందుకు సహకారం అందించాలని సూచించారు. అయిల్ పామ్ సాగులో ప్రభుత్వం నాలుగు సంవత్సరాల పాటు ఏడాదికి రూ. 2,100/- (మొత్తం రూ. 8,400/-) పంట యాజమాన్యానికి మరియు అంతర పంటల కోసం, అలాగే రూ. 11,001/- మొక్కల కొనుగోలుకు మరియు ఉపాధి హామీ జాబ్ కార్డు కలిగిన రైతులకు రూ. 41,325/- అందిస్తోందాని అన్నారు. డ్రిప్ పరికరాలపై ఎస్సీ, ఎస్టీ రైతులకు 100% రాయితీ, బి.సి. వెనుకబడిన తరగతులకు 90% రాయితీ, ఓ.సి. రైతులకు 80% రాయితీ అందించబడుతుందాని మరియు ఎస్సీ, ఎస్టీ రైతులు 10% వాటా, బి.సి. రైతులు 10%,ఓ.సి. రైతులు 20% వాటా చెల్లించి, 12% G.S.T. కూడా చెల్లించాల్సి ఉంటుందాని తెలిపారు, తద్వారా తక్కువ ఖర్చుతో మంచి దిగుబడులు పొందవచ్చని తెలిపారు. పంట సాగులో అన్ని విధాలుగా రైతులకు సహకారం అందించాలని ఈ ప్రణాళికకు సంబంధించి వారానికి ఒకసారి నివేదిక ఇవ్వాలని, రైతులకు నిరంతర ఆదాయ వనరులు కల్పించాలనే ఉద్దేశ్యంతోనే ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగా రావు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి అక్బర్ భాష, వ్యవసాయ అధికారి సక్రియా నాయక్, ఎల్.డి.యం అయ్యప్పు రెడ్డి, ఉద్యానవాన, వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి మండల స్థాయి అధికారులు, టి.ఎస్ ఆయిల్ ఫెడ్ అధికారులు, ఎ.పీ.ఓలు, తదితరులు పాల్గొన్నారు...

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333