పలు అభివృద్ధి పనులను శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే శ్రీ శ్రీ రామ్ రాజగోపాల్ తాతయ్య గారు

Oct 14, 2024 - 12:20
Oct 14, 2024 - 16:43
 0  37
పలు అభివృద్ధి పనులను శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే శ్రీ శ్రీ రామ్ రాజగోపాల్ తాతయ్య గారు

గ్రామాలలో అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట

గ్రామాలలో మౌలిక సదుపాయాలు కల్పనకు అత్యధిక ప్రాధాన్యత.

నియోజకవర్గంలో 17 కోట్లతో గ్రామాల అభివృద్ధి.

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే శ్రీ శ్రీరాం రాజగోపాల్ తాతయ్య గారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా ఈరోజు జగ్గయ్యపేట మండలంలో షేర్ మహమ్మద్ పేట గ్రామంలో 70 లక్షల రూపాయలతో సీసీ రోడ్స్ కమ్ డ్రైన్స్ మరియు గౌరవరం గ్రామంలో 50 లక్షలు తో సిసి రోడ్లు కమ్ డ్రెయిన్స్ ను గ్రామ పంచాయతీలో ఉపాధి హామీ నిధులు 5 కోట్లు తో గ్రామపంచాయతీ లలో నిర్మాణానికి ప్రభుత్వం *పనులు పండుగకు* శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఈరోజు ఎమ్మెల్యే శ్రీ శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) గారు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ పనులు మొత్తం సంక్రాంతి పండుగలోపు పూర్తి చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు యుద్ధ ప్రాతిపదికన పనులు మంజూరు చేస్తూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య గారు మాట్లాడుతూ.

_జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, వత్సవాయి, నందిగామ మండలాలలో గ్రామాలలో 17 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి నిధులు మంజూరైనట్లు వివరించారు. 

    జగ్గయ్యపేట నియోజకవర్గంలో నాలుగు మండలాలలో రేపు పల్లెలలో పండుగ వాతావరణం నడుమ అభివృద్ధి పనులకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. గత ఆగస్టు నెల 23వ తారీకు గ్రామాలలో జరిగిన గ్రామసభలలో తీసుకున్న తీర్మానాలకు అనుకూలంగా రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుపుకోవడానికి నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. 

   అక్టోబర్ 14 నుండి అక్టోబర్ 26 జరిగే పంచాయతీ వారోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యచరణగా పల్లెల అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు._

_ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కట్టా వెంకట నరసింహారావు మరియు షేర్ మహమ్మద్ పేట, గౌరవరం గ్రామాల నాయకులు మరియు అధికారులు తదితరులు పాల్గొన్నారు._

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State