ఎస్సీ రిజర్వేషన్ల ను ఏబిసిడిలుగా వర్గీకరించాలి

Mar 4, 2025 - 18:47
Mar 4, 2025 - 22:29
 0  16
ఎస్సీ రిజర్వేషన్ల ను ఏబిసిడిలుగా వర్గీకరించాలి

మాదిగ ఉపకులాల వాటా 11% ఇవ్వాలి


యాతాకుల రాజన్న మాదిగ

ఆత్మకూర్ ఎస్ 


ఆత్మకూరు ఎస్ మండల పరిధిలోని నిమ్మికల్  గ్రామంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు మేడి కృష్ణ మాదిగ అధ్యక్షతన డప్పుల ప్రదర్శన నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు యాతాకుల రాజన్న, మాదిగ ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు చింత వినయ్ మాదిగ హాజరై మాట్లాడుతూ మానవతా ఉద్యమాల పితామహుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత  మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో గత 30 సంవత్సరాలుగా అలుపెరుగని పోరాటం చేస్తూ బడుగు బలహీన వర్గాలకు పీడిత వర్గాలకు అండగా నిలిచి  అనేక ఫలితాలు సాధించిన చరిత్ర ఉందని అన్నారు. అదేవిధంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  నియమించిన జస్టిస్ సెమీమ్ అక్తర్ కమిషన్ నివేదికలో లోపాలు ఉన్నాయి అని,  వాటిని సవరించి ఎస్సీ రిజర్వేషన్లను నాలుగు భాగాలుగా ఏబిసిడిలుగా వర్గీకరించాలని, మాదిగ మరియు ఉప కులాలకు 11 శాతం వాటా కల్పించాలని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో  మాదిగ ఎమ్మెల్యేలకు రెండు మంత్రి పదవి  ఇవ్వాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో నాయకులు చింతలపాటి  చిన్న శ్రీరాములు మాదిగ, కళానేతలు గంట బిక్షపతి మాదిగ, యాతాకుల ప్రవీణ్ మాదిగ, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు ములకలపల్లి మల్లేష్ మాదిగ, మారేపల్లి జగన్ మాదిగ, బొడ్డు విజయ్ మాదిగ, చింత మధు మాదిగ,బొల్లె పాక మహేష్ మాదిగ, ఎడవెల్లి కార్తిక మాదిగ, బోలెపాక  చిరంజీవి మాదిగ, బొలెపాక మూతి లింగయ్య మాదిగ,  డప్పు మంగయ్య మాదిగ, ఎల్లయ్య మాదిగ, సూరారపు నాగయ్య మాదిగ,వెంకన్న మాదిగ, పిడమర్తి వెంకటేష్ మాదిగ, బొల్లెపాక మధు మాదిగ, కొండ రవి మాదిగ,మచ్చ సురేష్ మాదిగ, నవీలే వెంకటేష్ మాదిగ,  ఎడవెల్లి పండు మాదిగ,సూరి మాదిగ,తదితరులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333