ఆసత్య ప్రచారాలు నమ్మవద్దు
యువకుడిపై దాడి చేసిన ఘటనలో అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం
సంఘటన స్థలాన్ని సందర్శించి విలేకరులతో మాట్లాడిన సూర్యాపేట డిఎస్పీ రవి
సూర్యాపేట:- సూర్యాపేటలో చర్చి ఎదురుగా యువకుడి పై మరి కొంతమంది యువకులు గురువారం రాత్రి దాడి చేసిన విషయంలో సంఘటన స్థలాన్ని ఎస్సై బాలకృష్ణతో కలిసి డిఎస్పీ రవి శుక్రవారం పరిశీలించారు. అనంతరం సూర్యాపేట డిఎస్పి గొల్లూరి రవి విలేకరులతో మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సంఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించడం జరిగిందని, ఈ ఘటనపై కేసు నమోదు చేశామని తెలిపారు. గంజాయి మత్తులో ఈ ఘటనకు పాల్పడ్డారా? లేదా మరి ఏదైనా కోణం దాగి ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇంకా పూర్తిగా నిర్ధారణ కానీ ఈ సంఘటన కు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో వైరల్ చేయొద్దు ఆని విజ్ఞప్తి చేశారు. త్వరలోనే ఘటనకు సంబంధించి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని, గంజాయి మత్తులో దాడి చేసి ఉంటే అందుకు బాధ్యులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. గంజాయి సేవించినా, విక్రయించినా విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ రవి హెచ్చరించారు.