హక్కుల కోసం పోరాటం చేస్తే అరెస్టులా ఖబర్దార్ కాంగ్రెస్ ప్రభుత్వం

 రొండి శ్రీనివాస్

Mar 4, 2025 - 19:16
Mar 4, 2025 - 22:29
 0  5
హక్కుల కోసం పోరాటం చేస్తే అరెస్టులా ఖబర్దార్ కాంగ్రెస్ ప్రభుత్వం

తెలంగాణ వార్త మాడుగుల పల్లి మార్చి 4 ఈరోజు హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద అంగన్వాడి టీచర్లు ఆయాలు సూపర్వైజర్లు వారి సమస్యల పరిష్కారం కోసం ధర్నా నిర్వహించడం జరుగుతుంది అట్టి ధర్నాకి మాడుగులపల్లి మండలానికి సంబంధించిన అంగన్వాడీ టీచర్లు పోకుండా సిఐటి నాయకత్వాన్ని అంగన్వాడీ టీచర్లను అరెస్టు చేయడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు నాయకులు శ్రీనివాస్ మాట్లాడుతూ వారి హక్కుల కోసం ప్రభుత్వాన్ని అడగటానికి ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహిస్తే వారి సమస్యలు పరిష్కరించకుండా పోలీసుల ద్వారా అరెస్టు చేయించడం సిగ్గుచేటు సమస్య పరిష్కరిస్తే వారు రోడ్డు మీదకే రారు కదా వారితో వెట్టి చాకిరి చేయించుకుంటూ వారి పనికి తగ్గ వేతనం ఇవ్వకుండా వారిని నిర్బంధించటం సరైనది కాదు. రేపు రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో వారి వేతనాలు పెంచి వారికున్న సమస్యలను పరిష్కరించాలి లేనియెడల భవిష్యత్తులో ఉద్యమాలు నిర్వహిస్తాము. వారికి అండదండగా ఉంటాము అని అన్నారు అరెస్ట్ అయిన వారిలో అంగన్వాడీ టీచర్లు సులోచన అరుణ జానకి తదితరులు ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333