అడ్డగూడూరు మండల కేంద్రంలో బిజెపి నాయకుల సంబరాలు

Mar 4, 2025 - 18:15
Mar 4, 2025 - 22:30
 0  33
అడ్డగూడూరు మండల కేంద్రంలో బిజెపి నాయకుల సంబరాలు

అడ్డగూడూరు 4 మార్చి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- ఉమ్మడి కరీంనగర్,నిజామాబాద్,  మెదక్,అదిలాబాద్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో  తపాస్ బలపరిచిన బిజెపి అభ్యర్థి మల్కా కొమురయ్య గెలుపు సందర్భంగా  అడ్డగూడూరు మండల కేంద్రంలో బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు ననుబోతు సైదులు ఆధ్వర్యంలో  బాణాసంచా కాల్చి,మిఠాయిలు పంచి సంబరాలు నిర్వహించారు.ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు ననుబోతు సైదులు మాట్లాడుతూ..విద్యావంతులు ఉపాధ్యాయులు విద్యార్థులు భారత ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈ దేశం అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించి తెలంగాణలో మార్పు కావాలని ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్కా కొమురయ్య ను గెలిపించడం జరిగిందన్నారు.బిజెపి అభ్యర్థులకు ఓటు వేసిన ఉపాధ్యాయుల సంఘాలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన ప్రజా సమస్యల అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం పోరాటం చేస్తుందన్నారు.గెలుపు ఓటమిలు సంబంధం లేకుండా ప్రజలలో ఉండే పార్టీ బిజెపి  పార్టీయే అన్నారు.రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిక స్థానాలు గెలిచే విధంగా పని చేస్తాము అన్నారు.

ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రధాన కార్యదర్శులు కొత్తూరు నవీన్ కుమార్, లింగాల నరసింహ గౌడ్, మండల ఉపాధ్యక్షులు మరాటి కుమారస్వామి,జిల్లా మాజీ కార్యదర్శి లింగాల శ్యాంసుందర్ రెడ్డి, మండల మాజీ అధ్యక్షులు మేకల ఇమ్మానియేల్, మండల కార్యదర్శి దేశ బోయిన నాగరాజు, బూత్ అధ్యక్షులు కూరాకుల యాదగిరి, వెల్డవి బూత్ అధ్యక్షులు నిమ్మల రమేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.