ఉద్యోగి కి పదవీవిరమణ సహజం
తెలంగాణ వార్త కొండపాక:- కొండపాక ఏప్రిల్ 19 ఉద్యమ సమయంలో అంకితభావంతో చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డి అన్నారు. కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఆఫీసు సబార్డినేట్ బాలపోచయ్య ఉద్యోగ విరమణ అభినందన కార్యక్రమం శుక్రవారం పాఠశాలలో నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఉద్యోగ విరమణ అనేది సహజమని ఉద్యోగికి విరమణ తప్పదని కానీ ఉద్యోగంలో ఉన్న సమయంలో చేసిన పనులు సేవలు ఎప్పటికీ గుర్తింపు తెస్తాయన్నారు. బాల పోచయ్య దంపతులను ఎమ్మెల్సీ సత్కరించారు. కార్యక్రమంలో ఎంఈఓ శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఇంద్రసేనారెడ్డి, రామస్వామి, శ్రీనివాస్ రెడ్డి, రఘు రాములు, ఆయ పాఠశాలల ఉపాధ్యాయులు, పదవి విరమణ పొందిన బాల పోచయ్య బంధువులు పాల్గొన్నారు.