ఎస్సీ ఎస్టీ వర్గీకరణ పై సుప్రీంకోర్టు జడ్జీల తీర్పు బాధాకరం

Aug 22, 2024 - 09:31
 0  5
ఎస్సీ ఎస్టీ వర్గీకరణ పై సుప్రీంకోర్టు జడ్జీల తీర్పు బాధాకరం

- ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో భారత్ బంద్

- అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన వ్యక్తం చేసిన ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు

ఎస్సీ ఎస్టీ వర్గీకరణ విషయంలో రాష్ట్రాలకు అధికారాన్ని ఇస్తూ సుప్రీంకోర్టు జడ్జిలు ఇచ్చిన తీర్పు బాధాకరమని ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర కో కన్వీనర్ తలమల్ల హసేన్ అన్నారు. ఈ మేరకు బుధవారం నిర్వహించిన భారత్ బందులో భాగంగా పట్టణంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 తీసుకోకుండా కేవలం ఆర్టికల్ 16 తీసుకొని తీర్పు ఇవ్వడం దళిత గిరిజనులను విడదీయడమే అన్నారు. దేశంలో ఎస్సీ 59,  ఎస్టీ 54 కులాల జనాభా జాబితాను తయారుచేసి ఏ కులం అభివృద్ధి చెందిందో సర్వే చేసి శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు.  వెనుకబడిన కులాలకు తగిన నిధులు కేటాయించాలి తప్ప వర్గీకరణతో ఎలాంటి అభివృద్ధి సాధ్యం కాదన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జిల్లా కన్వీనర్ ఏడిండ్ల అశోక్,  కో కన్వీనర్లు అశోధ రవి, దాసరి దేవయ్య, కట్ల మురళి, కట్ట సైదులు, బోల్లెద్దు వినయ్, బోయిల్ల అఖిల్,  జానకి రాములు, పంగరెక్క సంజయ్, బొప్పని అనిల్,  గాజుల నర్సయ్య, బొల్లద్దు గోపయ్య,  వీర్జాలా వేణు బలరాం, తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333