తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ సభ్యులుగా సంకే సంకపెల్లి సుధీర్ రెడ్డి నియామకం

తిరుమలగిరి 17 ఫిబ్రవరి 2024 తెలంగాణ వార్త రిపోర్టర్:- సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల వాసి సంకెపెల్లి సుధీర్ రెడ్డి తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ సభ్యులుగా నియమిస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ సందర్భంగా సంకేపల్లి సుధీర్ రెడ్డి మాట్లాడుతూ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ సభ్యులుగా నియమించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు అదే విధంగా మండల వాసులు కాంగ్రెస్ నాయకులు సుధీర్ రెడ్డికి సభ్యులుగా అవకాశం కల్పించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ తిరుమలగిరి చౌరస్తాలో బాణ సంచాలు కాల్చారు