ఆగస్టు 11న ఉద్యమ కళాకారుల ఆత్మీయ సమ్మేళనం
-కళాకారులతో కలసి కరపత్రాలు ఆవిష్కరించిన మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి
తెలంగాణ కళావేదిక ఆధ్వర్యంలో ఆగస్టు 11న సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ కళ్యాణ మండపంలో ఉద్యమ కళాకారుల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నట్లు తెలంగాణ కళావేదిక జిల్లా అధ్యక్షులు ఎర్ర అనుదీప్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి చేతుల మీదుగా ఉద్యమ కళాకారుల ఆత్మీయ సమ్మేళనం కరపత్రాలను ఆవిష్కరింపజేసి మాట్లాడారు. తెలంగాణ కోసం ఆడి పాడిన కళాకారులకు ఉద్యోగాలు సాధనే తెలంగాణ కళావేదిక లక్ష్యమన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆడిపాడిన కళాకారులకు తెలంగాణ సాంస్క్రతిక సారధిలో ఉద్యోగాలు కల్పించాలని, 250 చదరపు గజాల్లో ఇంటి స్థలం మంజూరు చేసి ఇల్లు కట్టించి ఇవ్వాలని, వృద్ధ కళాకారులకు పదివేల పెన్షన్, హెల్త్కేర్డులు, ఉచిత ప్రయాణం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆగస్టు 11న నిర్వహించే ఉద్యమ కళాకారుల ఆత్మీయ సమ్మేళనానికి ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా గ్రామ గ్రామం నుంచి కళాకారులు తరలివచ్చి ఈ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సభకు ముఖ్య ఆతిధులుగా ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, ఎమ్మెల్యేలు మందుల సామేల్, ఉత్తమ్ పద్మాపతి, వేముల వీరేశం, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డిలు హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, కొప్పుల వేణారెడ్డి, తెలంగాణ కళావేదిక రాష్ట్ర కార్యదర్శి జువ్వాజి ప్రవీణ్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు చెరుకు శైలేందర్, మహిళా అధ్యక్షురాలు జూలూరి' అంబిక, ఉపాధ్యక్షురాలు సంతోష, నల్లగొండ జిల్లా అధ్యక్షులు పందిరి సైదులు, ఉపాధ్యక్షులు కోడి భీమ్ ప్రసాద్, సూర్యాపేట నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు గంట నాగలక్ష్మి, ఉపాధ్యక్షురాలు జ్యోతుల ప్రీతి, తుంగతుర్తి నియోజకవర్గ ఉపాధ్యక్షులు కందుకూరి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.