జగదీష్ రెడ్డి అనుచరుల భూమి కుంభకోణం పై

విచారణ జరిపించాలి బాధ్యులైన వారిని శిక్షించాలి ధర్మార్జున్ 

Jun 30, 2024 - 22:10
Jun 30, 2024 - 22:15
 0  37
జగదీష్ రెడ్డి అనుచరుల భూమి కుంభకోణం పై

సూర్యాపేట 30 జూన్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:-  సూర్యాపేట నియోజకవర్గ కేంద్రంలో మాజీ మంత్రి, సూర్యాపేట నియోజకవర్గ శాసనసభ్యులు జగదీశ్వర్ రెడ్డి అనుచరుల భూ కుంభకోణం పై ,భూదందాలపై న్యాయవిచారణ చేసి బాధ్యులైన వారిపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సూర్యాపేట నియోజకవర్గ ఇన్చార్జ్ ధర్మార్జున్ డిమాండ్ చేశారు .

  ఆదివారం తెలంగాణ జన సమితి సూర్యాపేట జిల్లా కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ సూర్యాపేట పట్టణంలో గత 10 సంవత్సరాలుగా బిఆర్ఎస్ నాయకుల భూ ఆక్రమణలు, దంధాలు పెరిగిపోతున్నాయని  మొదటి నుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్నా అధికారులు పట్టించుకోలేదని,  ఫలితంగా బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వ భూములను అక్రమ పద్ధతుల్లో పట్టాలు చేయించుకునే స్థాయికి ఎదిగారని ధర్మార్జున్ విమర్శించారు. కోట్లాది రూపాయల విలువచేసే ప్రభుత్వ  భూమిని తన అనుచరులకు కట్ట బెట్టారని ఆయన అన్నారు.

  సూర్యాపేట పట్టణానికి, కలెక్టరేట్ భవనానికి ఆనుకొని ఉన్నటువంటి కుడ కుడ126 సర్వే నెంబర్ భూమిలో నాటి అధికార పార్టీ నాయకుడు, సూర్యాపేట రియల్ ఎస్టేట్ వ్యాపారి కుడ కుడ స్మశాన వాటిక చుట్టు గతంలోనే కబ్జా చేసి  ప్లాట్లు చేసి అమాయకులకు అమ్ముకొని డబ్బులు దండుకున్నాడని ఆరోపించారు.  ఇప్పుడేమో  తన బినామీల పేరు మీద,    చనిపోయిన తన బందువుల పేరు మీద గూడ అక్రమంగా  పట్టా అమలు చేయించుకున్నాడనీ అన్నారు. కొంత  మంది బిఆర్ఎస్ నాయకులు అదే సర్వే నెంబర్ లో లేని ఇల్లు ఉన్నట్టుగా చూపించి ఫోటోషాప్ మార్ఫింగ్ లు చేసి రెగ్యులరైజ్ చేయించు కున్నారని, ఇది పూర్తిస్థాయిలో జగదీశ్వర్ రెడ్డి అండదండలతోటి జరిగిందని ధర్మార్జున్ భూమిలేని, ఇల్లు లేని నిరు పేదలకు, ఏళ్ల తరబడి ప్రభుత్వ భూములలో నివసిస్తూ గుడిసెలు వేసుకొని నివసిస్తున్న వారికి రెగ్యులరైజ్  చేయుట కొరకు గతంలో ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 58, 59 లు అడ్డం పెట్టుకొని కొన్ని  వృత్తు లలో వున్నవారిని, ఒకరిద్దరి పేద వాళ్ళని  వాస్తవంగా ఇవాల్సిన వారిని ముందు పెట్టిగత 10 సంవత్సరాల కాలంలో టిఆర్ఎస్ నాయకులు జెడ్పిటిసిలు, ఎంపీటీసీలు, కొంతమంది వార్డు మెంబర్లు, కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ,వాళ్ళ భార్యల పేరు మీద వాళ్ళ బినామీల పేరు మీద రెగ్యులర్ పట్టా చేయించుకున్నారన్నారు. ప్రభుత్వ జీవోలను దుర్వినియోగం చేసి ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిం

 చిన  అక్రమ దారులకు సహకారాన్ని అందించినటువంటి రెవెన్యూ అధికారులపై తక్షణమే చర్య తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు మరొకవైపు సూర్యాపేట పట్టణ నడిబొడ్డులో ఉన్నటువంటి సర్వే నెంబరు 817,816, 818 లలో ఉన్నటువంటి ఇనాం భూములను క్షుణ్ణంగా పరిశీలించి అసలైనల లబ్ధి దారులకు అందజేయాలని ఆయన కోరారు. 817 లో ఎకరం 38 గుంటల భూమి ఉండగా అందులో కొంత భూమి మాత్రమే ప్రభుత్వం కేటాయించిన స్థలం మినహాయించి మిగతా భూమిని కొంతమంది ఆక్రమించుకున్నారని వారు ఏ పార్టీలో ఉన్నా వారి ఆక్రమణ నుండి ఆ భూమిని విముక్తి చేసి ప్రభుత్వ కార్యాలయాలకు లేదా అసలైన నిరుపేదలకు అందజేయాలని ధర్మార్జున్ డిమాండ్ చేశారు

ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్ల రమా శంకర్, జిల్లా కార్యదర్శి బొడ్డు శంకర్ జిల్లా లీగల్ సెల్ జిల్లా కో కన్వీనర్ వీరేశ్ నాయక్  పట్టణ పార్టి కార్యదర్శి పాండు గౌడ్, ఎస్టి సెల్ పట్టణ కన్వీనర్ దేవత్ సతీష్, మైనార్టీ సెల్ పట్టణ కన్వీనర్ ఫరీద్, పార్టి నాయకులు మల్సూర్ తదితరులు పాల్గొన్నారు.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333