ఎలాంటి తప్పులు లేకుండా సర్వే చేయాలని జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్

Nov 9, 2024 - 19:20
 0  18
ఎలాంటి తప్పులు లేకుండా సర్వే చేయాలని జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్
ఎలాంటి తప్పులు లేకుండా సర్వే చేయాలని జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్

జోగులాంబ గద్వాల 9 నవంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- ఇటిక్యాల ఆర్ధిక, సామాజిక, రాజకీయ,    విద్య, ఉపాధి, కుల వివరాల సేకరణకై నిర్వహిస్తున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే లో పాల్గొనే ఎన్యుమరేటర్లు ఎలాంటి తప్పులు లేకుండా సర్వే చేయాలని జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ అన్నారు.శనివారం ఇటిక్యాల మండలం పెద్దదిన్నె గ్రామంలోని తొమ్మిదో వార్డులో నిర్వహిస్తున్న సర్వేను కలెక్టర్ తనిఖీ చేశారు.అంగన్వాడి టీచర్ నారాయణమ్మ సర్వే నిర్వహిస్తున్న ఇంటిని పరిశీలించి సర్వేను తెలుసుకున్నారు. ఇంటి యజమానితో పాటు కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేసి పొందుపరిచిన కోడ్ నెంబర్లను వేయాలన్నారు. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పార్ట్ 1లో  యజమాని వివరాలతో పాటు పార్ట్ 2 లో కుటుంబ సభ్యుల పూర్తి వివరాలు వార్షిక ఆదాయం తదితర వివరాలను పొందుపరచాలని తెలిపారు. ఈ సందర్భంగా ఏన్యుమరేటర్ కు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, డిపిఓ శ్యాంసుందర్, తాసిల్దార్ నరేందర్, ఎంపీడీవో ఎండి అజర్ మొహియుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333