రామ్ రెడ్డి మరణం  బాధాకరం 

May 7, 2025 - 18:56
 0  2
రామ్ రెడ్డి మరణం  బాధాకరం 

 సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్  అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్ 

 రియల్ ఎస్టేట్, నిర్మాణరంగ వ్యాపారి చల్లారామిరెడ్డి మరణం బాధాకరమని సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు పంతంగి  వీరస్వామి గౌడ్ అన్నారు. బుధవారం మండలంలోని తాళ్ల ఖమ్మంపాడు లో జరిగిన బిల్డర్ చల్లా శ్రీనివాస్  రెడ్డి చల్ల రాజశేఖర్ రెడ్డి గారి తండ్రి  చల్లారామిరెడ్డి దశదినకర్మకు హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించి మాట్లాడారు. సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన రామ్ రెడ్డి ఎంతో కష్టపడి ఉన్నత స్థాయికి ఎదిగాడని గుర్తు చేశారు. తన పిల్లల్ని కూడా కష్టపడి చదివించి ఉన్నత స్థాయిలో ఉంచారని చెప్పారు. నిర్మాణ రంగంలో తన కుమారులను సైతం అద్భుతంగా రాణించి ఎంతో మందికి ఉపాధి కల్పించారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట రియల్ ఎస్టేట్ జిల్లా కోశాధికారి పాల సైదులు, మందాడి గోవర్ధన్, సుధీర్, శేఖర్ రెడ్డి, విఠల్ ,వెంక రెడ్డి, మైపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333