అసత్య ప్రచారాలను నమ్మవద్దు:జిల్లా కలెక్టర్ బి. యం.సంతోష్

Nov 9, 2024 - 19:27
 0  10
అసత్య ప్రచారాలను నమ్మవద్దు:జిల్లా కలెక్టర్ బి. యం.సంతోష్

జోగులాంబ గద్వాల తొమ్మిది నవంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల జిల్లాలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ఎలాంటి సమస్యలు లేకుండా సజావుగా నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్ శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. రాజోలి మండలం పెద్దధన్వాడ గ్రామ సమీపంలో నిర్మిస్తున్న 
ఈథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేయాలని అలంపూర్ శాసనసభ్యులు విజయుడు తొ కలసి గ్రామ ప్రజలు నిరసన తెలుపుతున్నారని, ఇట్టి వార్తను పొరపాటున  సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను గ్రామంలో ప్రజలు అడ్డుకుంటున్నట్లు స్వతంత్ర వార్త టీవీలో ప్రసారం చేయడం పట్ల సంబంధిత రిపోర్టర్ ను అడగగా, వార్త పొరపాటున ప్రసరమైనట్లు తెలియజేయడం జరిగినదని, వచ్చిన ఇట్టి వార్తలో వాస్తవం లేదని, ఇలాంటి వార్తలను ప్రజలు నమ్మకూడదని, అసత్య వార్తలు ప్రచురించరాదని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా తెలియజేశారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి సర్వేను నిర్వహించడం జరుగుతుందని, పొరపాట్లకు ఎలాంటి తావు లేకుండా ప్రణాళిక బద్ధంగా జిల్లాలో ఈరోజు ఉదయం నుండి అన్ని గ్రామాలలో సర్వే విజయవంతంగా చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రజలందరూ నిర్భయంగా పూర్తి సమాచారాన్ని ఇమ్యునరేటర్ లకు అందజేస్తూ సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రజలు, ప్రజా ప్రతినిధులు సహకరించాలని జిల్లా కలెక్టర్ కోరారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333