మండలంలోని వివిధ గ్రామాల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి!
ఎస్ ఐ నాగరాజు
అడ్డగూడూరు 26 ఫిబ్రవరి 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- అడ్డగూడూరు మండల వివిధ గ్రామాల,పరిసర ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అడ్డగూడూరు మండల పోలీసు వారు ప్రజలను విజ్ఞప్తి కోరడమైనది. బైకుల దొంగతనాలు, పశువుల దొంగతనాలు, ట్రాన్స్ఫార్మర్ దొంగతనాలు జరుగుతున్నాయి, మీరు వేరే ఉరు వెళ్లాల్సి వస్తే తప్పకుండా మీ ఇంటి పక్క వారికి మరియు పోలీసు శాఖ వారికి సమాచారం ఇవ్వండి మేము వచ్చి మీ ఇంటి వైపు గస్తీ తిరుగుతాం షాపులు ఉన్నవాళ్లు ఎట్టి పరిస్థితిలోనూ మీ షాపులో క్యాష్ కౌంటర్లు డబ్బు, విలువైన వస్తువులు ఉంచకూడదు షాపు యజమానులు షాపు బయట లోపల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి.కావున అప్రమత్తంగా ఉండాలి మీ ఇంటి వద్ద లేదా మహిళలు పొలాల వద్ద ఉన్నప్పుడు అపరిచిత వ్యక్తులు అడ్రస్ అడగడానికి లేదా మరేదైనా పని ఉంది అంటూ ఒంటరి మహిళల దగ్గరకు వచ్చి మెడలో గొలుసులు లాక్కొని వెళ్లే ప్రయత్నం చేస్తారు. దానిపైన కూడా ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలి మరియు పరిచయం లేని వ్యక్తులు టీవీ రిపేర్ అని ఇంటర్నెట్ కనెక్షన్ అని ఇల్లు అద్దెకు కావాలని వస్తారు వారి విషయంలో జాగ్రత్త వహించాలి.
ఈ మధ్యకాలంలో పిల్లల్ని ఎత్తుకుపోతున్నారని అక్కడక్కడ వార్తలు వస్తున్నాయి.రాత్రివేళ ఎవరైనా తెలిసినా వాళ్లు పిలిచినట్టు పిలిచిన తొందరపడి డోర్ తెరవకండి రాత్రి వేళల్లో గ్రామ యూత్ మరియు కమ్యూనిటీ వాళ్ళు కలిసి గ్రామాల్లో తిరిగి పోలీస్ శాఖ వారికి సహకరించండి దొంగతనం అయిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి మీరు జాగ్రత్తగా ఉండండి ఇతరులను జాగ్రత్త పరచండి అని ఎస్ఐ నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు.